Begin typing your search above and press return to search.
లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ టాప్ -10 చిత్రాలివే
By: Tupaki Desk | 7 July 2021 5:30 PM GMTబాలీవుడ్ లో లెజండరీ నటుడు దిలీప్ కుమార్ నటించిన పాపులర్ క్లాసిక్ చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన నట ప్రస్థానంలో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. బాలీవుడ్ చిత్రాల గురించి మాట్లాడాల్సి వస్తే దిలీప్ కుమార్ కు ముందు...తర్వాత అనే మాట్లాడుకోవాల్సిందే. ఎన్నో వైవిథ్యమైన చిత్రాల్లో నటించి బాలీవుడ్ కి ఎనలేని సేవలందించారు. అతని నటనలో ప్రత్యకత దృష్ట్యా ట్రాజెడీ కింగ్ అని కూడా అంటారు. అంతటి దిగ్గజ నటుడి కెరీర్ లో టాప్ -10 చిత్రాల గురించి చెప్పుకోవాల్సి వస్తే...
దిలీప్ కుమార్ నటించిన `మోఘల్ ఏ ఆజామ్` 1960 లో రిలీజ్ అయింది. మొఘల్ చక్రవర్తి అక్భర్..తన కుమారుడు సలీం మధ్య ఓ అందమైన డ్రామాతో తరకెక్కిన చిత్రమిది. ఇందులో సలీం పాత్రలో దిలీప్ కుమార్ నటించారు. అనార్కలీ ప్రేమికుడిగా కనిపించి అప్పటి యువతను ఉర్రుతలూగించారు. ఆ సినిమాతో బాలీవుడ్ లో ప్రేమ సన్నివేశాలకు కొత్త రూపం ఇచ్చారు. ఇక 1952 లో ఆయన నటించిన `దాగ్` రిలీజ్ అయింది. ఈ సినిమా దిలీప్ కుమార్ కు తొలి ఫిలిం ఫేర్ అవార్డును తెచ్చి పెట్టింది. ఆయన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అని ఆయన అనేవారు.
అలాగే 1957 లో ఆయన నటించిన మరో చిత్రం `నయా దౌర్` రిలీజ్ అయింది. భారతదేశంలో నెహ్రూవాది కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇది అప్పట్లో మంచి కమర్శియల్ సక్సెస్ ని అందించింది. ఇక 1958 లో దిలీప్ కుమార్ నటించిన `మధుమతి` రిలీజ్ అయింది. ఇందులో ఆయనకు జోడీగా వైజయంతి మాల నటించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 1961 లో `గంగా జమున` రిలీజ్ అయింది. దిలీప్ కుమార్ నిర్మించిన ఒకే ఒక్క సినిమా ఇది. ఒక అమాయకుడు బలవంతంగా బందిపోటుగా ఎలా మారుతాడు అన్నది చిత్ర కథాంశం.
అలాగే 1967లో ఆయన నటించిన `రామ్ ఔర్ శ్యామ్` రిలీజ్ అయింది. దిలీప్ కుమార్ నటించిన ఫేమస్ ట్రాజిక్ రోల్స్ లో ఈ చిత్రం ఒకటిగా నిలిచింది. ఇక 1955 లో `దేవదాస్` రిలీజ్ అయింది. భగ్న ప్రేమికుడు `దేవదాస్` పాత్రకు దిలీప్ కుమార్ ప్రాణం పోసారు. శరత్ చంద్ర ఛటోఫోద్యాయ నవల ఆధారంగా తెరకెక్కించారు. అలాగే అమితాబచ్చన్-దిలీప్ కుమార్ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా శక్తి. 1982 లో రిలీజ్ అయింది. దర్శకుడు రమేష్ సిప్పీ పనితనానికి గాను బాలీవుడ్ సినిమా చరిత్రలోనే ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది.
అలాగే 1984 లో ముషాల్ రిలీజ్ అయింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తి పాత్రలో నటించిన దిలీప్ కుమార్ ప్రతీకారం తీర్చుకోవడానికి అదే చట్టానికి ఎలా వ్యతిరేకంగా మారారు అన్నది ఎంతో ఆసక్తికరం. ఈ పాత్రతో దిలీప్ కుమార్ లో కొత్త కోణం బయట పడిందని బాలీవుడ్ అంటుంది. అలాగే దిలీప్ కుమార్ నటించిన కర్మ 1986 లో రిలీజ్ అయింది. విధాత సినిమాతో విజయం అందుకున్న సుభాష్ ఘయ్.. దిలీప్ కుమార్ కలిసి నటించారు. మంచి విజయం సాధించింది. ఇలా ఎన్నో సినిమాల్లో.. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో దిలీప్ కుమార్ బాలీవుడ్ కు సేవలందించారు.