Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో విషాదం.. దిగ్గజ నటుడి కన్నుమూత

By:  Tupaki Desk   |   15 Nov 2020 11:50 AM GMT
సినీ ఇండస్ట్రీలో విషాదం.. దిగ్గజ నటుడి కన్నుమూత
X
యావత్ దేశ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. ప్రముఖ సినీ నటుడు కన్నుమూశారు. దేశంలోనే దిగ్గజ నటుడిగా పేరుతెచ్చుకున్న ఆయన మృతిపై సినీ సెలెబ్రెటీలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ కరోనా సోకి కోలుకొని ఆ తర్వాత అనారోగ్యం వెంటాడడంతో మృతి చెందారు. గత అక్టోబర్ లో కరోనా బారిన పడ్డ ఆయన చికిత్స కోసం అదే నెలలో 6న కోలకతాలోని ఆసుపత్రిలో చేరారు. తాజాగా చటర్జీ ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం కన్నుమూశారు.

85 ఏళ్ల సౌమిత్ర చటర్జీ నట జీవితంలో 300 లకు పైగా చిత్రాల్లో నటించారు. నాటకకర్త, రంగస్థల నటుడు, కవిగా కూడా పేరు తెచ్చుకున్నారు. 1959లో సౌమిత్ర సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత అభిజాన్, చారులత వంటి అనేక చిత్రాల్లో దర్శక త్వం వహించారు.

సౌమిత్ర ఛటర్జీకి భారత ప్రభుత్వం 2004లో పద్మభూషన్ పురస్కారం ప్రదానం చేసింది. అలాగే సినీ రంగంల అత్యున్నత భారతీయ పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డును 2012లో అందించింది.

ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పటి వరకు దేశంలో ఎందరో సినీ ప్రముఖులు కరోనాతో మరణించారు. తాజాగా చటర్జీనీ సైతం కరోనాను బలి తీసుకోవడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.