Begin typing your search above and press return to search.
వీరమల్లు సెట్ లో లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్
By: Tupaki Desk | 28 March 2022 10:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పీరియడిక్ మూవీ `హరి హర వీరమల్లు`. 17 వ శతాబ్దం నేపథ్యంలో మెఘల్ సామ్రాజ్యం కాలం నాటి పరిస్థితుల కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ . దాయాకర్ రావుతో కలిసి నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. 2020లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. 2021లో టైటిల్ ని ప్రకటిస్తూ చిత్ర బృందం ప్రకటన చేసింది.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా ఈ మూవీ కోసం పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో భారీ సెట్ లని, ఓ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. హీరో పవన్ కల్యాణ్ పాల్గొనగా 15 రోజుల పాటు పలు కీలక ఘట్టాలని చిత్రీకరించారు. కోవిడ్ మొదలైంది. షూటింగ్ ఆగింది. 2021 జనవరిలో మళ్లీ చిత్రీకరణ ప్రారంభించారు కొంత షూటింగ్ చేశారు. కానీ అందులో పవన్ పాల్గొనలేదు. ఫిబ్రవరి నుంచి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపల్ ఎంట్రీ ఇచ్చారు.
చార్మినార్, రెడ్ ఫోర్ట్, మచిలీపట్నం పోర్ట్ కి సంబంధించిన కీలక సెట్ లని నిర్మించారు. కానీ పవన్ మాత్రం సెట్ లో కి అడుగుపెట్టలేదు. కారణం `భీమ్లానాయక్`. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా వుండటం వల్ల గత కొన్ని రోజులుగా `హరి హర వీరమల్లు` చిత్రీకరణ ఆలస్యం అవుతూ వస్తోంది. సినిమా డిలే కావడంతో ఈ చిత్రానికి అనుకున్న ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ని పక్కన పెట్టేసి మళ్లీ ఆనంద్ సాయిని తీసుకున్నారు. అతని నేతృత్వంలో పలు సెట్ లని నిర్మించారు.
జనవరి నుంచి షూటింగ్ మదలు పెట్టాలనుకున్నారు. కానీ పవన్ అందుబాటులో లేకపోవడంతో షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం పద్మశ్ర తోట తరణి నేతృత్వంలో భారీ సెట్ ల నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే తాజా షెడ్యూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెట్ లో తోట తరణి, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలిశారు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి పలు అంశాలపై పవన్ చర్చించినట్టుగా తెలుస్తోంది.
ఈ ఇద్దరు కలిసి `హరి హర వీరమల్లు` సెట్స్ లో హల్ చల్ చేస్తున్న ఓ ఫొటోని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారీ సెట్ ల నిర్మాణం పద్మ తోట తరణి గారి పర్యవేక్షణలో జరుగుతోందని వెల్లడించింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ క్రేజీ లేడీ నర్గీస్ ఫక్రీ, సోనాక్షీ సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.