Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో విషాదం: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత!

By:  Tupaki Desk   |   22 May 2021 8:34 AM GMT
బాలీవుడ్ లో విషాదం: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత!
X
చిత్రపరిశ్రమలో ఓ వైపు కరోనా భయంతో జనాలు వణికిపోతుంటే.. మరోవైపు ఎంతోమంది అభిమాన సెలబ్రిటీలను - ఆత్మీయులను కోల్పోతున్నారు. ఇప్పటికే ఎంతో అభిమానించే డైరెక్టర్స్ - ప్రొడ్యూసర్స్ - నటులను కోల్పోయిన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో చేదు వార్త అందరిని కలచివేస్తోంది. ప్రముఖ సంగీతదర్శకుడు రామ్ లక్ష్మణ్ ఈరోజు నాగపూర్ లోని తన సొంత ఇంట్లో కన్నుమూశారు. డెబ్భై తొమ్మిదేళ్ల రామ్ లక్ష్మణ్.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారట. అదిగాక వయసు పైబడటంతో ఈ మద్యే కోవిడ్ రెండు డోసుల వాక్సిన్ కూడా తీసుకున్నారట. అప్పటినుండి ఆయనకు ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉండటం లేదని.. ఊరికే అలసట - వీక్ నెస్ తో బలహీనంగా అయిపోయారని ఆయన కుటుంబికులు తెలిపారు.

రామ్ లక్ష్మణ్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రారంభంలో మైనే ప్యార్ కియా - హమ్ ఆప్కే హై కౌన్ - హమ్ సాత్ సాత్ లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో రామ్ లక్ష్మన్ ఎనలేని కీర్తిని ఘడించారు. అయితే ఆయన హిందీతో పాటుగా మరాఠీ - భోజ్ పూరీ భాషల్లో కూడా ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. అయితే ఓ ఆర్కెస్ట్రాలో సభ్యుడిగా కెరీర్ ప్రారంభించిన రామ్ లక్ష్మణ్.. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి మొదటగా మరాఠీ సినిమాలకు సంగీతం అందించారట. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఎన్నో అద్భుతమైన సినిమాలను తన మ్యూజిక్ తో నిలబెట్టారు.

ఎక్కువగా సూరజ్ బాత్యా తెరకెక్కించిన సినిమాలతో రామ్ లక్ష్మణ్ పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే తాజాగా ఆయన మరణం గురించి కుమారుడు స్పందించి.. శనివారం రాత్రి 1గంట సమయంలో ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోయారని మీడియాతో తెలిపారు. అయితే రామ్ లక్ష్మణ్ మరణంతో బాలీవుడ్ సెలబ్రిటీలు - సన్నిహితులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. అదేవిధంగా సీనియర్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ పెట్టారు. "సంగీతజ్ఞానీ - ప్రసిద్ధ సంగీతకారుడు రామ్‌లక్ష్మణ్ జీ (విజయ్ పాటిల్) కన్నుమూసినట్లు నాకు తెలిసింది. ఈ వార్త వినగానే చాలా బాధగా అనిపించింది. ఆయన చాలా మంచి వ్యక్తి. నేను సంగీతంలో చాలా పాటలు పాడాను. అలాగే అవన్నీ కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ సందర్బంగా అయనకు వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను." అంటూ ఆమె పోస్ట్ చేశారు. అయితే రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. ప్రస్తుతం ఆయనకు సంతాపం తెలియజేస్తూ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు.