Begin typing your search above and press return to search.
లెజెండరీ సంగీత దర్శకుడు బప్పీలహరి ఇక లేరు
By: Tupaki Desk | 16 Feb 2022 3:08 AM GMTప్రముఖ గాయకుడు.. స్వరకర్త బప్పీలహరి పలు అనారోగ్య సమస్యలతో ముంబై ఆసుపత్రిలో మరణించినట్లు జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఆయన మరణ వార్తను ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ముంబైలోని జుహూలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69.
బప్పీలహరి నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కానీ మంగళవారం అతని ఆరోగ్యం క్షీణించింది. అతని కుటుంబం వైద్యుడిని రావాల్సిందిగా పిలిపించింది. అనంతరం అతన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారు. బప్పీలహరికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించాడు. OSA (అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా) కారణంగా అర్ధరాత్రి వేళ ఆయన తుది శ్వాస విడిచారు.. అని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ నంజోషి చెప్పారు.
బప్పి డా అని ముద్దుగా పిలవబడే అతను తన హిట్ నంబర్ లతో సంగీత ప్రియుల్ని ఓలలాడించారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సౌత్ లోనూ ఎంతగానో పాపులరయ్యారు. అతడికి బంగారం అంటే విపరీతమైన వ్యామోహం. బప్పిలహరి డిస్కో డ్యాన్సర్.. హిమ్మత్‌వాలా- షరాబి- అడ్వెంచర్స్ ఆఫ్ టార్జాన్- డ్యాన్స్ డ్యాన్స్- సత్యమేవ్ జయతే,- కమెండో- ఆజ్ కే షాహెన్‌షా- తానేదార్- నంబ్రి ఆద్మీ- షోలా ఔర్ షబ్నం వంటి సినిమాలకు పాటలు స్వరపరిచారు.
గాయకుడు-కంపోజర్ మొదటి పెద్ద బాలీవుడ్ హిట్ స్కోర్ అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ చిత్రం జఖ్మీ .. ఆ తర్వాత అతడి కెరీర్ పరంగా వెనుదిరిగి చూడలేదు.
తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజుల్లోనే సింహాసనం సినిమా కోసం బప్పీలహరిని రంగంలోకి దించారు. రాజులు రాజ్యాలు రాకుమార్తెలు బందిపోట్లు.. పోరాటాల నేపథ్యంలో సింహాసనం సినిమా బంపర్ హిట్ అవ్వడంలో బప్పీలహరి మ్యూజిక్ పనితనం ఎంతో గొప్పది.
గత దశాబ్దంలో బప్పీ లాహిరి ది డర్టీ పిక్చర్ కోసం ఓహ్ లా లా... గుండే కోసం ట్యూన్ మారి ఎంట్రీయన్.. బద్రీనాథ్ కీ దుల్హనియా కోసం తమ్మా తమ్మా,.. ఇటీవల శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ కోసం అరేయ్ ప్యార్ కర్ లే వంటి పాటలు పాడారు. అతను చివరిగా 2020 చిత్రం బాఘీ 3 కోసం భంకస్ పాటను కంపోజ్ చేశాడు.
గత సంవత్సరం బప్పీలహరికి కోవిడ్ -19 నిర్ధారణ అయిన తర్వాత ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. సెప్టెంబరులో, గాయకుడు-కంపోజర్ తన ఆరోగ్యం గురించిన నివేదికలను కొట్టిపారేశాడు. ``నేను నా స్వరాన్ని కోల్పోయానని పేర్కొన్న చాలా నివేదికలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది హాస్యాస్పదంగా ఉంది నేను నిజంగా సంతోషంగా లేను`` అంటూ ఆవేదన చెందారు.