Begin typing your search above and press return to search.

పదేళ్ల జైలు శిక్ష పడ్డ లెజెండ్రీ స్టార్‌ మూడేళ్లకే విడుదల

By:  Tupaki Desk   |   1 July 2021 11:30 PM GMT
పదేళ్ల జైలు శిక్ష పడ్డ లెజెండ్రీ స్టార్‌ మూడేళ్లకే విడుదల
X
హాలీవుడ్‌ సీనియర్ స్టార్.. లెజెండ్రీ స్టార్‌ కమెడియన్‌ నిలిచిన బిల్ కాస్బీ కి 2018 సంవత్సరంలో లైంగిక వేదింపుల కేసులో ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష ను కోర్టు విధించింది. 60 మంది ఈయనకు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ లు వేయడంతో పాటు వారు అంతా కూడా కాస్బీ తమపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అంటూ ఆరోపించడంతో కోర్టు ఆయనకు శిక్ష విధించింది. మొదట కోర్టు ఆయనకు శిక్ష విధించే విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొంది. కాని ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకుని మరీ ఆయనకు పదేళ్ల జైలు శిక్షను విదించడం జరిగింది. ఆయన పదేళ్ల జైలు శిక్షలో మూడు సంవత్సరాలు పూర్తి అవ్వగా ఇటీవల అనూహ్యంగా ఆయన్ను విడుదల చేస్తూ పెన్సిల్వేనియా ధర్మాసనం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

కాస్బీ కి విధించిన శిక్ష విషయంలో ప్రస్తుతం ధర్మాసనం విచారణ జరిపింది. బాధితులు ఏ ఒక్కరు కూడా లిఖిత పూర్వకంగా ఆధారాలు ఇవ్వలేదు. పైగా గత ధర్మాసనం ఒప్పందం చేసుకుని కాస్బీ కి జైలు శిక్ష విధించడం వల్ల ఆయన్ను విడుదల చేస్తున్నట్లుగా కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ధర్మాసనం నిర్ణయంతో వెంటనే ఆయన్ను విడుదల చేయడం జరిగింది. తాజాగా జరిగిన పరిణామాల వల్ల బాధితులు సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతో మళ్లీ కాస్బీ జైలుకు వెళ్లే అవకాశమే లేదని అక్కడి న్యాయ నిపుణులు అంటున్నారు.

కాస్బీ కేసు విషయానికి వస్తే మొదట 2005 సంవత్సరంలో టెంపుల్‌ యూనివర్శిటీ బాస్కెట్‌ బాల్ టీమ్ అడ్మినిస్ట్రేటర్‌ ఆండ్రియా కాన్‌ స్టాండ్‌ తనపై కాస్బీ లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు చేసింది. ఆ సమయంలో ఆమెకు 3.5 మిలియన్ డాలర్లను ఇచ్చి రాజీ కుదుర్చుకున్నాడు. మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఆండ్రియా కాన్‌ స్టాండ్ కోర్టును ఆశ్రయించింది. ఆమె వెంట మీటూ అంటూ ఏకంగా 60 మంది కూడా కాస్బీ పై ఫిర్యాదు చేశారు. ఆ కారణంగా గత కోర్టు ఆయనకు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కాని తాజా పరిణామాల కారణంగా ఆయన విడుదల అయ్యాడు. కాస్బీ విడుదల అవ్వడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ లా లో ఉన్న లొసుగులతో కాస్బీ అడ్డ దారిలో బయటకు వచ్చాడంటూ వారు ఆరోపిస్తున్నారు.