Begin typing your search above and press return to search.
షాక్: పీఆర్వోపై కేసు పెట్టిన ప్రముఖ నటి
By: Tupaki Desk | 15 July 2022 2:30 AM GMTస్టార్లను ప్రమోట్ చేసేందుకు భారీ ప్యాకేజీలను అందుకునే పాపులర్ పీఆర్ ఏజెన్సీలు ఉన్నాయి. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా లేదా హాలీవుడ్ అయినా స్టార్లకు ప్రమోషన్ తప్పనిసరి. అయితే ఈ ప్యాకేజీలు చెల్లింపుల్లో ఆర్థిక వ్యవహారాల్లో కలతలు వచ్చినప్పుడే ఇబ్బంది. పోలీసులు కోర్టులు కేసులు అంటూ కొన్ని తిప్పలు తప్పవు.
ఇప్పుడు అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటోంది పాపులర్ కథానాయిక...గేమ్ ఆఫ్ థ్రోన్స్ (క్వీన్ సెర్సీ లన్నిస్టర్ పాత్రధారి) ఫేం లీనా హెడీ. ఈ బ్యూటీ తన మాజీ ఏజెన్సీ నుండి 1.5 మిలియన్ల డాలర్లకు సంబంధించిన కోర్టు దావాను ఎదుర్కొంటోంది. లీనా హెడీ ఇటీవలి మార్వెల్ చిత్రం `థోర్: లవ్ అండ్ థండర్`లో నటించింది.
కమీషన్ ఫీజులో తమకు పెద్ద మొత్తంలో డబ్బు రావాల్సి ఉందని అందుకే దావా వేసినట్లు సదరు నటీమణికి చెందిన ఎక్స్ ఏజెన్సీ పేర్కొంది. థోర్: లవ్ అండ్ థండర్ లో పాత్ర పోషించినందుకు లీనా హెడీ వారికి ఐదు లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉందిట. కానీ లీనా హెడే సినిమాలో నటించినా తన సన్నివేశాలను ఎడిటింగ్ లో కోసేయడంతో వారి మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి.
ఇక థోర్ మూవీతో పాటు `9 బుల్లెట్స్` చిత్రంలో తన పాత్రకు కమీషన్ ఫీజుగా 3లక్షల డాటర్లను.. టెలివిజన్ ధారావాహిక రీటాలో ఆమె పాత్ర కోసం 6.5 లక్షల డాలర్లను చెల్లించాలని కూడా ఏజెన్సీ డిమాండ్ చేస్తోంది. ఆ షో మొదటి ఎపిసోడ్ కు మించి లీనా నటించలేదు. సినిమాలు బుల్లితెర పాత్రల ద్వారా లీనా సంపాదించుకోవడం ప్రారంభించాక.. వందల వేల డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉందని సదరు ఏజెన్సీ పేర్కొంది. లీనా హెడ్ 2005లో ట్రోకా (Troika)లో చేరారు. ఆమె 2020లో నిష్క్రమించింది. ఇప్పుడు ఏజెన్సీ తమకు చెల్లించాల్సిన కమీషన్ ఫీజును చెల్లించాలని పట్టుబడుతోంది. ఆమె ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ న్యాయపరమైన ఉత్తర్వును కూడా జారీ చేశారు.
కానీ లీనా వెర్షన్ వేరొకలా ఉంది. తాను సదరు ఏజెన్సీ ట్రాకాతో ఎప్పుడూ ఒప్పందంపై సంతకం చేయలేదని.. ప్రతిదీ మౌఖిక ఒప్పందం ఆధారంగా పనిచేశామని చెప్పారు. థోర్: లవ్ అండ్ థండర్ డైరెక్టర్ నేరుగా తనను సంప్రదించాడని ..ట్రోయికాకు ఈ చిత్రంపై తన సంపాదనతో సంబంధం లేదని కూడా చెప్పింది. ప్రస్తుతం కోర్టు విచారణలో నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది.