Begin typing your search above and press return to search.
జాక్ వేసిన పంచ్ లు మామూలుగా లేవు
By: Tupaki Desk | 29 Feb 2016 11:30 AM GMTటైటానిక్.. సినిమా లవర్స్ ఎవరూ జాక్ డాసన్ పాత్రను కానీ.. ఆ రోల్ లో కనిపించిన లియోనార్డో డికాప్రియోను కానీ మర్చిపోలేరు. తన నటనతో అంతగా మార్క్ వేసిన ఈ హీరో.. అప్పటి నుంచి ఆస్కార్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు తన కలను సాకారం చేసుకుని ఆస్కార్ అందుకున్నాడు. ఇప్పటికి డికాప్రియో 6 సార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యాడు. అందులో నాలుగు సార్లు ఉత్తమ నటుడి కేటగిరీలోనే పోటీ పడ్డాడు.
చివరకు ఆరో నామినేషన్ ఈ హాలీవుడ్ హీరో ని ఆస్కార్ వరించింది. ది రెవెనెంట్ చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గాను డికాప్రియోకు ఆస్కార్ దక్కింది. ఈ అవార్డు తీసుకున్నాక, ఈ హీరో చేసిన మాటలు అందరినీ ఆలోచింపచేశాయి. 'ది రెవెనెంట్ చిత్రం ఒక వ్యక్తికి సహజమైన ప్రపంచంతో ఉన్న అనుబంధంతో ముడిపడి ఉంటుంది. ఇన్ని శతాబ్దాల చరిత్రలో 2015 అత్యంత వేడిగా గడపాల్సి వచ్చింది. మంచును వెతుక్కుంటూ నేను, మా టీం దక్షిణ ధృవం వరకూ వెళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. వాతావరణంలో మార్పులు.. ఇప్పుడు ఎంతో భయానకంగా మారుతున్నాయి' అన్నాడు డికాప్రియో.
'మన సమాజంలో అత్యధికంగా కాలుష్యానికి కారణమయ్యే వారిని, కార్పొరేట్ కంపెనీలను ఏమీ అనలేని పెద్దలు.. మానవత్వం గురించి లెక్చర్స్ ఇస్తూ ఉంటాయి. ఇక ప్రపంచంలో ఏదీ వరంగా దొరకదు. నేను ఈ అవార్డును ఓ వరంగా దక్కించుకోలేదు' అంటూ ఇన్ డైరెక్టుగా చాలామందికి చురకలు వేశాడు లియోనార్డో డికాప్రియో.