Begin typing your search above and press return to search.
హీరో రూ.315 కోట్ల విరాళం
By: Tupaki Desk | 19 May 2021 6:31 AM GMTకోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకునే హీరోలు ఎంతో మంది ఇండియాలో ఉన్నారు. కాని వారిలో కొందరు తప్ప మిగిలిన వారంతా కూడా కనీసం లక్షల్లో కూడా సేవాకార్యక్రమాలకు విరాళం ఇవ్వరు. వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న హీరోలు ఇచ్చే విరాళాలు కొన్ని సార్లు విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. కాని హాలీవుడ్ స్టార్ హీరో లియానార్డో డికాప్రియా ఏకంగా 43 మిలియన్ డాలర్లను అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.315 కోట్లు విరాళంగా ఇచ్చాడు. అంతరించి పోతున్న జంతువులను మరియు పక్షుల జాతులను పరిరక్షించేందుకు లియానార్డో ఈ విరాళం ఇచ్చారు.
ప్రకృతి అంటే ఎంతో ప్రేమాభిమానం ఉండే చూపించే ఈ టైటానిక్ హీరో ఎప్పటి నుండో జంతువల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో రకాల జంతువుల జాతులు అంతం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న అడవి జంతువులు కూడా ఉండే అవకాశం లేదు. ఆ కారణంగానే కొందరు ప్రముఖులు నడుం భిగించి అడవుల్లో జంతువులను పరిరక్షించేందుకు సిద్దం అయ్యారు. ఎన్నో స్వచ్చంద సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. లియానార్డో రీవైల్డ్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి ఈ పని చేస్తున్నాడు.
రీ వైల్డ్ సంస్థ మెక్సికో నుండి చిలీ వరకు విస్తరించి ఉన్న అటవి ప్రాంతంలో ఎన్నో అరుదైన ప్రాణులను సంరక్షించేందుకు ముందుకు వచ్చారు. వారికి ఎందరో ప్రముఖులు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఇప్పుడు టైటానిక్ హీరో ఏకంగా 43 మిలియన్ డాలర్లతో ఆ సంస్థ చేస్తున్న పనులకు అండగా నిలిచాడు. గతంలో కూడా ఈ హీరో వందల కోట్లను ఇలా ఛారిటీలకు ఇవ్వడం జరిగింది. రియల్ హీరో అంటూ కీర్తించబడుతున్న లియానార్డో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిద్దాం.