Begin typing your search above and press return to search.

'టైటానిక్‌' హీరో కావేరి కాలింగ్‌

By:  Tupaki Desk   |   24 Sep 2019 11:14 AM GMT
టైటానిక్‌ హీరో కావేరి కాలింగ్‌
X
భారతదేశంలో జీవనదుల పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుతోంది. కావేరి నది పరిస్థితి దారుణం తయారయ్యింది. మరికొన్నాళ్లు పరిస్థితి ఇలాగే ఉంటే కావేరి నది చరిత్రకే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది. దాంతో కావేరి పరిరక్షణకు పలు స్వచ్చంద సంస్థలు నడుం భిగించాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ కావేరి కాలింగ్‌ అనే కార్యక్రమంను చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా కావేరి నది తీరాన చెట్లను పెంచాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆయన పిలుపుతో నదితీర ప్రాంతంలో ఉండే ప్రజలు.. రైతులు 250 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.

కావేరి కాలింగ్‌ కార్యక్రమంకు సినీ ప్రముఖులు ఎంతోమంది మద్దతు పలికారు. జగ్గీ వాసుదేవ్‌ కావేరి కాలింగ్‌ కు మద్దతుగా కమల్‌ హాసన్‌.. కంగనా రనౌత్‌.. పునీత్‌ రాజ్‌ కుమార్‌.. కాజల్‌.. సమంత.. రాధిక.. త్రిష.. జుహ్లీ చావ్లా.. సుహాసినితో పాటు ఇంకా ఎంతోమంది తమిళ మరియు కన్నడ సినీ ప్రముఖులు నిలిచారు. వీరంతా కూడా కావేరి నది పరిరక్షణ కోసం తమవంతు కృషి చేస్తామంటూ ముందుకు వస్తారు. వీరితో పాటు హాలీవుడ్‌ స్టార్‌ టైటానిక్‌ హీరో డికాప్రియో కూడా కావేరి కాలింగ్‌ కు మద్దతు తెలిపారు.

టైటానిక్‌ స్టార్‌ డికాప్రియో ఫేస్‌ బుక్‌ ద్వారా కావేరి నది గురించి స్పందించారు. ఇండియాలో నదుల పరిస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్‌ చేశారు. నదుల పరిరక్షణ కోసం గురు జగ్గీ వాసుదేవ్‌ గారితో కలిసి నడవాల్సిందిగా అందరికి సూచించాడు. గతంలో చెన్నైలో నీటి కష్టాలపై స్పందించి తన మంచితనంను చాటుకున్న డికాప్రియో ఇప్పుడు ఇండియాలో నదుల సమస్యపై స్పందించి ప్రపంచ వ్యాప్తంగా కావేరి కాలింగ్‌ కు గుర్తింపు తీసుకు వచ్చారు. కావేరి నదిని మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రతి నదిని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని జగ్గీ వాసుదేవ్‌ కోరుతున్నారు.