Begin typing your search above and press return to search.
ఇలాంటి పాత్రలేంటి షాలినీ
By: Tupaki Desk | 1 March 2019 12:30 PM GMTయూత్ సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండకు మొదటి బ్రేక్ గా నిలిచిన అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేకు టైం కలిసి రావడం లేదో లేక కెరీర్ ప్లానింగ్ లో వేస్తున్న తప్పటడుగులు ఏమో కానీ కనీసం గట్టిగా చెప్పుకోలేని పాత్రలు చేస్తూ అభిమానులను నిరాశ పరుస్తోంది.
ఇవాళ విడుదలైన కళ్యాణ్ రామ్ లో షాలిని పాండే పాత్ర చూస్తే ఇదే సందేహం కలగడం ఖాయం. తనకు వచ్చిన కలలో హత్య చేయబడిన అమ్మాయిని వెతికే పనిలో హీరో బిజీగా ఉండగా మధ్యలో ఓ నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఫస్ట్ హాఫ్ లో ఓ పాటేసుకోవడానికి తప్ప తను చేసిన మేఘ అనే పాత్ర ఇంకెందుకూ ఉపయోగపడలేదు . అర్జున్ రెడ్డిలో హీరోతో సమానంగా ప్రేమను వ్యక్తపరిచే పాత్రలో జీవించిన షాలిని పాండే ఈ ఏడాది కనిపించిన రెండో సినిమా ఇది. ఎన్టీఆర్ కథానాయకుడులో ఏ మాత్రం ప్రాధాన్యం లేని ఓ చిన్న క్యామియోలో కనిపించి అసలు ఉందా లేదా అన్నట్టు మాయమైపోయింది గత ఏడాది కూడా తనకు చెప్పుకోదగ్గ సినిమా ఏది రాలేదు. మహానటిలో కీర్తి సురేష్ స్నేహితురాలిగా చేస్తే క్రెడిట్ మొత్తం టీం పంచుకుంది కాని తనకు దక్కింది జీరోనే. ఇలా చాలా ఉదాహరణలే ఉన్నాయి.
ఇవన్ని ఒక ఎత్తు అయితే 118లో చేసిన మేఘ పాత్ర తనకు ఏ మాత్రం ప్లస్ కాకపోవడం చూస్తే ఇకపై కథల ఎంపికలో ఇంకాస్త జాగ్రత్త ఉండాల్సిన అవసరాన్ని చూపిస్తోంది. డెబ్యు మూవీనే బ్లాక్ బస్టర్ కొట్టిన షాలిని కాంబోలను కాకుండా కథలను నమ్ముకుంటే బెటర్. తమిళ్ లో ఓ రెండు సినిమాలు చేస్తున్న షాలినికి తెలుగులో మాత్రం పెద్దగా ఆఫర్స్ లేకపోవడం గమనార్హం