Begin typing your search above and press return to search.

వీడియో: స్వాతిముత్యం స్టెప్పులతో అదరగొట్టిన వెంకీ - పూజా - వరుణ్..!

By:  Tupaki Desk   |   24 May 2022 7:43 AM GMT
వీడియో: స్వాతిముత్యం స్టెప్పులతో అదరగొట్టిన వెంకీ - పూజా - వరుణ్..!
X
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ''ఎఫ్ 3'' సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ఫ్రాంచైజీలో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.. థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడానికి మరో 3 రోజుల్లో అంటే మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ''ఎఫ్ 3''. దిల్ రాజు సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా భాటియా - మెహరీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషించింది. పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ లో మెరవనుంది.

ఇప్పటికే 'ఎఫ్ 3' నుంచి రిలీజ్ చేయబడిన ట్రైలర్ మరియు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో.. వైవిధ్యమైన ప్రచార కార్యక్రమాలతో సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ 'లైఫ్ అంటే ఇట్లా ఉండాలా' అనే సాంగ్ ఫుల్ వీడియోని వదిలారు.

'హాత్ మే పైసా.. మూతిమే సీసా.. పోరీతో సల్సా.. రాతిరంతా జల్సా.. అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా' అంటూ సాగిన ఈ పార్టీ సాంగ్ వీక్షకులను అలరిస్తోంది. అందరూ పెద్ద పెద్ద కలలు కనాలని.. ఆ విధంగా జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే లైఫ్ అని ఈ పాట ద్వారా చెబుతున్నారు.

పార్టీ థీమ్ తో కలర్ ఫుల్ గా డిజైన్ చేయబడిన ఈ సాంగ్ కు రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో వెంకీ - వరుణ్ లతో కలిసి పూజా హెగ్డే వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. స్వాతిముత్యంలో కమల్ హాసన్ స్టైల్ లో వేసిన డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది.

బుట్టబొమ్మ పూజా హెగ్డే పొట్టి పొట్టి దుస్తుల్లో గ్లామర్ ట్రీట్ అందించిందనే చెప్పాలి. ఇక పాట చివర్లో వరుణ్ తేజ్ ఈ సినిమాలోని తన పాత్రకు తగ్గట్టుగా నత్తితో పాడుతూ నవ్వించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ ఫుట్-ట్యాపింగ్ ఫన్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేయగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ మరియు గీతా మాధురి కలిసి హుషారుగా ఆలపించారు.

''ఎఫ్ 3'' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. సాయి శ్రీరామ్ దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. తమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేశారు.