Begin typing your search above and press return to search.

పుస్త‌క రూపంలోకి అల‌నాటి అందాల న‌టుడి జీవ‌త చ‌రిత్ర‌!

By:  Tupaki Desk   |   3 Sep 2022 11:08 AM GMT
పుస్త‌క రూపంలోకి అల‌నాటి అందాల న‌టుడి జీవ‌త చ‌రిత్ర‌!
X
బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు బుద్ద‌రాజు హ‌ర‌నాథ్ రాజు. 1936లో సెప్టెంబ‌ర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండ‌లంలోని రాప‌ర్తి గ్రామంలో జ‌న్మించారు.

చెన్నైలో పాఠ‌శాల విద్య‌ను అభ్య‌సించిన ఆయ‌న కాకినాడలోని పి.ఆర్ క‌ళాశాల‌తో బీఏ పూర్తి చేశారు. 'మా ఇంటి మ‌హాల‌క్ష్మి' సినిమాతో 1959లో న‌టుడిగా కెరీర్ ప్రారంభించారు. జ‌మున టైటిల్ పాత్ర పోషించిన ఈ మూవీ న‌టుడిగా హ‌ర‌నాథ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

అప్ప‌టి నుంచి తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, బెంగాలీ భాష‌ల్లో దాదాపుగా 167 సినిమాల్లో న‌టించారు. ఆయ‌న న‌టించిన సినిమాల్లో అమ‌ర శిల్పి జ‌క్క‌న్న‌, లేత మ‌న‌సులు, చిట్టి చెల్లెలు, పాండ‌వ వ‌న‌వాసం ఎవ‌ర్ గ్రీన్ మూవీస్ గా నిలిచిపోయాయి. 'సీతాక‌ల్యాణం' లో శ్రీ‌రాముడిగా, భీష్మ‌లో శ్రీ‌కృష్ణుడిగా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఆరోజుల్లో అందాల న‌టుడిగా పేరు తెచ్చుకున్న హ‌ర‌నాథ్ 1989, న‌వంబ‌ర్ 1న మ‌ర‌ణించారు.

అయితే ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను 'అందాల న‌టుడు' పేరుతో ఆయ‌న వీరాభిమాని డాక్ట‌ర్ కంప‌ల్లి ర‌విచంద్ర‌న్ ఓ పుస్తకాన్ని ర‌చించారు. హ‌ర‌నాథ్‌కు సంబంధించిన అరుదైన ఫొటోలు, ఎవ‌రికీ తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో ఈ పుస్త‌కాన్ని అందంగా తీర్చిదిద్దారు.

డాక్ట‌ర్ కంప‌ల్లి ర‌విచంద్ర‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, ఇత‌ర సంస్థ‌ల నుంచి అనేక అవార్డులు అందుకున్నారు. దివంగ‌త హీరో హ‌ర‌నాథ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందించిన పుస్తకం 'అందాల న‌టుడు'ని ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న సూప‌ర్ స్టార్ కృష్ణ ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో హ‌ర‌నాథ్ కుమార్తె జి. ప‌ద్మ‌జ‌, అల్లుడు, 'తొలిప్రేమ', గోదావ‌రి చిత్రాల నిర్మాత జీవిజి రాజు, మ‌న‌వ‌లు శ్రీ‌నాథ్ రాజు, శ్రీ‌రామ్ రాజు పాల్గొన్నారు. హ‌రనాథ్ కుమారుడు శ్రీ‌నాథ‌రాజు (గోకులంలో సీత‌, రాఘ‌వేంద్ర ) కోడ‌లు మాధురి, మ‌న‌వ‌రాళ్లు శ్రీ‌లేఖ‌, శ్రీ‌హ‌రి చెన్నైలో నివాసం వుంటున్నారు. పుస్తాకావిష్క‌ర‌ణ అనంత‌రం సూప‌ర్ స్టార్ కృష్ణ అల‌నాటి న‌టుడు హ‌ర‌నాథ్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను హీరోగా న‌టించిన 'మా ఇంటి దేవ‌త‌' మూవీని హ‌ర‌నాథ్ నిర్మించార‌ని, ఆమ‌న మంచి న‌టుడే కాకుండా మంచి మ‌నిషి అని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.