Begin typing your search above and press return to search.

'శ్యామ్ కె నాయుడు' పై ప్రాణహాని కేసు: నటి శ్రీసుధ

By:  Tupaki Desk   |   23 Jan 2021 12:30 PM GMT
శ్యామ్ కె నాయుడు పై ప్రాణహాని కేసు: నటి శ్రీసుధ
X
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీసుధా మరోసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టింది. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు పై తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అన్ని విధాలుగా లొంగదీసుకొన్నాడని గతేడాది మే నెలలో శ్రీసుధా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్యామ్ కె నాయుడు వలన తనకు ప్రాణహాని ఉందని చెప్పి మరోసారి అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది శ్రీసుధా. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ మొత్తం చర్చనీయంశంగా మారింది. అయితే గతంలో అతనిపై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలి అనే బెదిరింపుల కారణంగానే తను మళ్లీ ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది శ్రీసుధా. అయితే ఆమె రాజీ అయినట్లు నకిలీ పత్రాలు క్రియేట్ చేసి కోర్టులో శ్యామ్ కె నాయుడు సమర్పించాడని చెబుతూ.. అతడిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ కూడా చేయలేదని ఫిర్యాదులో వివరించి వాపోయింది బాధితురాలు. అయితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

"ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు గడిచాక పెళ్లికి నిరాకరించి మోసం చేసినట్లు గతేడాది మే 26న ఫిర్యాదు చేసింది శ్రీసుధా. ఈ విషయంలో ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ మాగంటి సాయిరాంలు.. శ్యామ్ కె నాయుడుకు మద్దతుగా నిలిచి అతని పై పెట్టిన కేసు వాపస్ తీసుకొని రాజీకి రావాలని బెదిరించారట. అనంతరం గతేడాది ఆగష్టు 5న మాదాపూర్ లోని చిన్నా నివాసంలో శ్రీసుధాను శ్యామ్ కె నాయుడు, చిన్నా, మాగంటి సాయిరాం ముగ్గురు కలిసి తనను బెదిరించి దూషించడమే గాక శారీరక దాడికి పాల్పడ్డట్లు ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. అలాగే ఇండస్ట్రీలో ఉండాలంటే ఈ విషయం బయటికి చెప్తే బాగోదని బెదిరిస్తే తను ఇంతకాలం నోరు మెదపలేదని అంటోంది శ్రీసుధా. ఇక ప్రస్తుతం మళ్లీ తనకు శ్యామ్ కె నాయుడు, అతని కుటుంబసభ్యులు, స్నేహితులతో ప్రాణహాని భయం వలన తను ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే పోలీసులు ఈ కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. మరి మోసం చేయడమే గాక ఇలాంటి బెదిరింపులు ఏంటని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి శ్రీసుధాకు మాదాపూర్ పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తారో అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.