Begin typing your search above and press return to search.

ఆ హీరోలాంటి భర్త ఉంటే సూపర్ హ్యాపీ అంటున్న లైగ‌ర్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   1 Feb 2022 6:30 AM GMT
ఆ హీరోలాంటి భర్త ఉంటే సూపర్ హ్యాపీ అంటున్న లైగ‌ర్‌ బ్యూటీ
X
అనన్య పాండే.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఈమె ఒక‌రు. సీనియ‌ర్ న‌టుడు చుంకీ పాండే ముద్దుల కుమార్తె అయిన అన‌న్య పాండే `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్ 2`తో సినీ రంగ‌ప్ర‌వేశం చేసి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆపై వ‌రుస సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న ఆ హాట్ బ్యూటీ.. త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి కూడా `లైగ‌ర్‌` సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమా గ‌నుక మంచి విజ‌యం సాధించే అన‌న్యకు పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ క్రేజ్ ద‌క్క‌డం ఖాయం అవుతుంది.

ఇక‌పోతే అన‌న్య మ‌రి కొద్ది రోజుల్లో `గెహ్రాయాన్‌` అనే మూవీతో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. సిద్దాంత్ చతుర్వేది, దీపికా పదుకునేలు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా.. ప్ర‌మోష‌న్స్ కోసం అన‌న్య‌ పాండే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా అన‌న్య‌.. సినిమా విష‌యాల‌తో పాటు త‌న‌కు ఎలాంటి భ‌ర్త కావాలో కూడా వివ‌రించింది.

ఆమె మాట్లాడుతూ.. తాను చిన్నతనం నుంచీ షారుఖ్ ఖాన్ న‌టించిన లవ్ స్టోరీస్ చూసి పెరిగానని, ఆ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. అలాగే ఆ సినిమాల్లో హీరోకి ఉండే క్యారెక్టర్ ఉన్న అబ్బాయి తనకు భ‌ర్త‌గా వ‌స్తే సూప‌ర్ హ్యాపీ అంటూ అన‌న్య చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.