Begin typing your search above and press return to search.
లైగర్ ఎఫెక్ట్.. బుట్టబొమ్మ డేట్స్ పరిస్థితేంటీ?
By: Tupaki Desk | 7 Sep 2022 2:30 AM GMTరైడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్'. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి పూరి, ఛార్మీ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా రికార్డుల మోత మోగిస్తుందని, పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చిత్ర బృందంతో పాటు అంతా భావించారు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో షాక్ కు గురయ్యారు.
మూడేళ్లు కష్టపడిన ప్రాజెక్ట్ ఊహించని విధంగా షాక్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక హీరో విజయ్ దేవరకొండ సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ మూవీ దాదాపు 70 శాతం నష్టాలని మేకర్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కి కలిగించిందని, దీని రికవరీ కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ని ఇటీవలే కొంత మంది బయ్యర్స్ కలిసి కీలక విషయాలపై చర్చించారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కు ముందే హడావిడీగా పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న 'జనగణమన' సినిమాని ముంబైలో అట్టహాసంగా ప్రారంభించారు. విజయ్ దేవరకొండ హీరోగా ఈ మూవీని పట్టాలెక్కించారు. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.
ఓ షెడ్యూల్ కూడా ముంబైలో పూర్తి చేశాడు పూరి. అయితే 'లైగర్' ఎఫెక్ట్ కారణంగా 'జనగణమన' ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మూవీని పూరి అర్థాంతరంగా ఆపేశాడనే చర్చ మొదలైంది.
అయితే 'లైగర్' ఫెల్యూర్ తో మారిన సమీకరణాల నేపథ్యంలో 'జనగణమన' పూర్తిగా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ మూవీ కోసం డేట్స్ కేటాయించిన బుట్టబొమ్మ పూ.ఆ హెగ్డే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'లైగర్' హిట్టవుతుందనుకుని 'జనగణమన'ని ఎక్కడా ఆపకుండా పూర్తి చేయాలని పూజా గ్డే డేట్స్ ని అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు పూరి తీసుకున్నారట.మరి ఆ డేట్స్ పరిస్థితి ఏంటీ తన డేట్స్ ని మరో సినిమాకు కేటాయిస్తారా? .. లేదంటే తన మనో ప్రాజెక్ట్ లో చేస్తావని పూరి సర్థిచెబుతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
'జనగణమన' కారణంగా పూజా హుగ్డే .. త్రివిక్రమ్ మూవీ సెకండ్ షెడ్యూల్ లో ఎంటరవుతానందట. మరి ఇప్పడు ఆ ప్లాన్ మారుతుందా? .. లేక ముందు అనుకున్నట్టే త్రివిక్రమ్ పూజా హెగ్డే లేకుండానే సినిమా మొదలు పెట్టేస్తాడా? వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.