Begin typing your search above and press return to search.
లైగర్ ఎఫెక్ట్.. పూరి సంచలన నిర్ణయం?
By: Tupaki Desk | 10 Dec 2022 1:30 PM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో వెర్సటైల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ ఏడాది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీగా `లైగర్` ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ మూవీని పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లపై కరణ్ జోహార్ తో కలిసి పూరి, ఛార్మి ఈ భారీ క్రేజీ మూవీని నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన `లైగర్` ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది.
మూడేళ్ల పాటు గాయాలని లెక్కచేయకుండా కఠోరంగా శ్రమించిన విజయ్ దేవరకొండకు చేదు జ్ఞాపకంగా మిగిలి ఊమించని షాకిచ్చింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో తన సత్తా చాటాలనుకున్నాడు. కానీ అది జరగకపోగా తొలి ప్రయత్నంలోనే భారీ డిజాస్టర్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత కారణంగా పూరి చుట్టూ వివాదం చెలరేగడం.. పలువురు డిస్ట్రిబ్యూటర్లు, శోభన్ అనే ప్రధాన ఫైనాన్షియర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ తనని బెదిరించాడని, అతని వల్ల తనకు ప్రాణ హాని వుందంటూ పూరి పోలీసుల్ని ఆశ్రయించడంతో `లైగర్` పెద్ద రచ్చకు దారి తీసింది.
రీసెంట్ గా ఈ మూవీ పెట్టుబడుల విషయంలోనూ వివాదం చెలరేగడం.. పూరి, ఛార్మీ ఈడీ కార్యాలయానికి వెళ్లడం.. చట్టవిరుద్ధంగా దుబాయ్ కి డబ్బు పంపించి తిరిగి ఇండియాకు రప్నించి పెట్టుబడులుగా చూపించే ప్రయత్నం చేశారని ఈడీ పూరి, ఛార్మీలపై సంచలన వ్యాఖ్యలు చేయడం.. హీరో విజయ్ దేవరకొండని కూడా గంటల తరబడి ఈడీ ప్రశ్నించడంతో `లైగర్` పతాక శీర్షికల్లో నిలిచి సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలకు ఛార్మీతో కలిసి పూరి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇకపై నిర్మాణ బాధ్యతలకు దూరంగా వుండాలని పూరి నిర్ణయించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో చిరంజీవితో పూరి ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి పూరి ఓన్లీ డైరెక్టర్ గానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడట. ఈ మూవీ కోసం ప్రస్తుతం పూరి నిర్మాతని వెతికే పనిలో వున్నాడట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.