Begin typing your search above and press return to search.

పిక్ టాక్: మెగాస్టార్ - సూపర్ స్టార్ లతో 'లైగర్' గ్యాంగ్..!

By:  Tupaki Desk   |   1 Aug 2022 10:54 AM GMT
పిక్ టాక్: మెగాస్టార్ - సూపర్ స్టార్ లతో లైగర్ గ్యాంగ్..!
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం రిలీజ్ కు రెడీ అయింది. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 25న విడుదల కానుంది.

'లైగర్' నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు 'అకిడి పక్డి' - 'వాట్ లగా దేంగే' పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకొని.. సినిమాపై హైప్ తీసుకొచ్చాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్న VD అండ్ టీమ్.. ఆదివారం ముంబై లోని ఒక మాల్ లో సందడి చేశారు. ఈ క్రమంలో తాజాగా 'గాడ్ ఫాదర్' సెట్ ను చిత్ర బృందం సందర్శించింది.

'గాడ్ ఫాదర్' కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లపై ప్రస్తుతం ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'లైగర్' టీమ్ తమ సినిమా కోసం ఇద్దరు అగ్ర హీరోల ఆశీస్సులు తీసుకున్నారు. స్టార్స్ ఇద్దరూ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ - సూపర్ స్టార్ లతో 'లైగర్' మీట్ కు సంబంధించిన ఫొటోని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చిరు - సల్మాన్ ఇద్దరూ స్పెషల్ కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా ఉండగా.. వారితో పాటుగా పూరీ - ఛార్మీ కౌర్ - వీడీ కనిపిస్తున్నారు. 'గాడ్ ఫాదర్' సినిమాలో పూరీ జగన్నాథ్ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే

'లైగర్' సినిమాని పూరీ కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి - ఛార్మి - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా.. కెచా స్టంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇస్తున్నాడు. రమ్య కృష్ణ- రోనిత్ రాయ్ - విషు రెడ్డి - అలీ - మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు.

'లైగర్' చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూరీ మరియు వీడీ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మరి ఈ చిత్రంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.