Begin typing your search above and press return to search.
#LIGER: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సందేశం!
By: Tupaki Desk | 4 Nov 2021 4:48 AM GMTహీరో విజయ్ దేవరకొండ -డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ LIGER (సాలా క్రాస్‌బ్రీడ్) శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ అనంతరం పూరి ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా స్పీడ్ పెంచారు. ఇక ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ శక్తివంతమైన పాత్రను పోషిస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. విజయ్ వర్సెస్ టైసన్ సన్నివేశాల గురించి ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది.
టైసన్ భయపెట్టే క్రూరమైన ప్రవర్తన పంచ్ ల రుచి ఎలా ఉంటుందో మూవీ రూపంలోనూ భారతీయ ఆడియెన్ వీక్షించనున్నారు. బాక్సింగ్ రింగ్ లో అరివీరభయంక పరాక్రమానికి పేరుగాంచిన టైసన్ ఈ చిత్రంతో భారతీయ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నారు. అజేయమైన భీకరుడైన మైక్ టైసన్ పోస్టర్ ని తాజాగా లైగర్ టీమ్ విడుదల చేసింది. పోస్టర్ పై అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది లైగర్ టీమ్. సూట్ ధరించి మైక్ టైసన్ పోస్టర్ లో పంచీగా క్రూరంగా కనిపిస్తున్నాడు అతని పంచ్ పవర్ ఎలా ఉంటుందో ముందే రుచి చూపిస్తున్నట్టుగానే ఉందీ పోస్టర్. నిప్పులు చెరిగే పిడిగుద్దుల వీరుడి నుంచి మంటలు రేగుతున్న పోస్టర్ మరింత ఆసక్తిని పెంచుతోంది. బాక్సింగ్ దేవుడిని ఒక భారతీయ సినిమాలో ఇలా ఇంటెన్సివ్ రోల్ లో చూడటం కన్నుల పండువగా ఉంటుందని టీమ్ చెబుతోంది.
``నమస్తే ఇండియా... మీ నుండి ఎప్పటికీ ప్రేమతో .... ఇకపై `షిట్`ని పొందడానికి సిద్ధంగా ఉండండి #LIGER ...హ్యాపీ దీపావళి ..`` అంటూ క్యాప్షన్ ని ఇచ్చారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. దీనికోసం అతడు వృత్తి నిపుణుల వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. గ్రేట్ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తో కలిసి తెరపై అతడు ఎలా కనిపిస్తారో ఊహించుకోవడం మొదలైంది. వెండితెరపై అద్భుత పంచింగ్ విన్యాసాలతో ఆ ఇద్దరూ మెరిపించనున్నారు. LIGER లో వరల్డ్ ఫేమస్ విదేశీ యోధులు నటిస్తుండడం మరో హైలైట్ కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
పూరీ కనెక్ట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇది అత్యంత క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఒకటిగా పాపులరైంది. పైగా ది గ్రేట్ మైక్ టైసన్ ని బరిలో దించేందుకు ధర్మ ప్రొడక్షన్స్ చాలా శక్తివంచన లేకుండా ప్రయత్నించిందని తెలిసింది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా థాయ్‌లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. లైగర్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 2022 ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్- ఛార్మీ కౌర్- కరణ్ జోహార్ - అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ- తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం లో రమ్య కృష్ణ- రోనిత్ రాయ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.