Begin typing your search above and press return to search.
'లైగర్' లేట్..సీక్రెట్ చెప్పని పూరి!
By: Tupaki Desk | 16 Jun 2022 6:30 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మేకింగ్..టేకింగ్ గురించి ప్రత్యేకించాల్సిన పనిలేదు. బ్యాంకాక్ బీచ్ లో కూర్చున్నాడంటే నెల రోజుల్లో కథ రాయడం పూర్తవుతుంది. అక్కడ నుంచి బయల్దేరి హైదరాబాద్ వచ్చాడంటే ఆ స్ర్కిప్ట్ తో మూడు నెల్లో షూటింఒగ్ సహా నిర్మాణానంతర పనులు పూర్తిచేసి సినిమా రిలీజ్ చేయగల సత్తా ఉన్న ఏకైక దర్శకుడు.
ఈ విషయాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి సైతం చాలా సందర్భాల్లో చెప్పారు. సినిమా తీయడం పూరి దగ్గర నేర్చుకోవాలని...అందుకు తానెంత మాత్రం సిగ్గుపడనని అంతటి దిగ్గజమే ఉద్ఘాటించారంటే? పూరి పనితనం గురించి చెప్పే దేముంది. ఇంకా మహా అయితే ఇంకో రెండు నెలలు సమయం అదనంగా పడుతుంది. అంతకు మించి పూరి సమయం తీసుకోవడం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు.
ఒకవేళ సినిమా ఆలస్యమవుతుందంటే? అందుకు వేరే కారణాలుంటాయి. హీరో కారణంగా షూటింగ్ డిలే...పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం ఇలా కొన్ని కారణాలు వినిపిస్తుంటాయి. కానీ `లైగర్` విషయంలో పూరి ఈ లెక్క తప్పినట్లే కనిపిస్తుంది. `లైగర్` ప్రాజెక్ట్ ప్రకటన 2019లో వచ్చింది. ఆ తర్వాత కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు డిలే జరిగింది.
మధ్య లో షూటింగ్ జరగడం..అతరాయం ఏర్పడటం జరిగింది. ఇది `లైగర్` కే కాదు. చాలా సినిమాల విషయంలో జరిగింది. వాటి రిలీజ్ కూడా జరిగింది. అవన్నీ వదిలేసి చూస్తే `లైగర్` షూటింగ్ ప్రారంభమై పూర్తవ్వడానికి రెండున్నరేళ్లు పట్టింది. అయితే అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టడం మరింత ఆశ్చర్యం కల్గిస్తుంది.
సాధారణంగా పోస్ట్ ప్రొడక్షన్ కి పూరి ఎక్కువ సమయం తీసుకోరు. 2 నెలలుకంటే ఎక్కువ సమాయానికి ఏమాత్రం స్కోప్ లేదు. కానీ `లైగర్` విషయంలో అదీ పక్కదారి పట్టిందని వినిపిస్తుంది. ఆగస్టు 25వ వరకూ సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేదని చెప్పేయడంతో అసలు `లైగర్` విషయంలో బ్యాకెండ్ ఏం జరుగుతుందో కూడా క్లారిటీ మిస్ అవుతుంది.
తెలుగు..హిందీ భాషల్లో చేసిన సినిమా కాబట్టి సమయం పడుతుంది. కానీ మరి ఇంత డిలే కి ఏమాత్రం ఆస్కారం లేదని కొంత మంది వాదన. `లైగర్` తో పాటు ప్రారంభమైన పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ జరిగింది గానీ..`లైగర్` కే ఇన్ని అడ్డంకులు ఎలా? అన్న విమర్శ తెరపైకి వస్తోంది. వీటిపై ఓ సారి పూరి క్లారిటీ ఇస్తే క్లారిటీ లేని కథనాలకు స్పష్టత దొరుకుతుందని తెలుస్తుంది.