Begin typing your search above and press return to search.
విజిలేస్తూ ఫస్ట్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!
By: Tupaki Desk | 6 July 2022 12:46 PM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెండేళ్లుగా ప్రాణం పెట్టి చేస్తున్న పానఖ్ ఇండియా మూవీ `లైగర్`. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మంగా భావిస్తున్న ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ కరణ్ జోహార్, చార్మీ, పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై ఇంటర్నేషనల్ మేకర్స్ దృష్టి పడింది.
ముంబై స్లబ్ ఏరియాలో వుండే ఓ ఛాయ్ బండీ వాలా ఏవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచాడనే కథ, కథనాలతో ఈ మూవీని పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. `ఆగ్ లగాదేంగే..` అంటూ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్.. మైక్ టైసన్ విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ బాక్సర్ గా మారిన విజయ్ దేవరకొండ ఈ మూవీ కోసం చాలానే కష్టపడ్డాడు.
ఈ మూవీతో బాలీవుడ్ బాటపడుతున్న విజయ్ తాజా గా విడుదల చేసిన న్యూడ్ పోస్టర్ సినిమాపై మరింత క్రేజ్ ని, బజ్ ని క్రియేట్ చేసింది. ఆగస్టు 25న భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయబోతున్నారు. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్నఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి శ్రీకారం చుడుతున్నారు.
ఈ మూవీకి మణిశర్మ నేపథ్య సంగీతం అందిస్తుండగా సాంగ్స్ కి విక్రమ్ మల్హోత్నా, తనిష్క్ బగ్చి సంగీతం అందిస్తున్నారు. జూలై 8న ఫస్ట్ సింగిల్ గా `లక్డీ పక్డీ....` రిలికల్ సాంగ్ టీజర్ వీడియోని, జూలై 11న సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని బుధవారం విడుదల చేశారు.
పోస్టర్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ చిల్ అవుతూ కనిపించారుజ విజయ్ దేవరకొండ రెడ్ బ్లేజర్, బ్లూ జీన్స్ తో యమ జోష్ లో హీరోయిన్ తో విజిల్ వేయిస్తున్న స్టిల్ సాంగ్ మరింత జోష్ తో సాగుతుందని స్పష్టం చేస్తోంది. హీరోయిన్ అనన్య పాండే బ్లాక్ ఔట్ ఫిట్ లో గ్లామర్ ఒలకబోస్తూ కనిపిస్తోంది. ఈ పాటని పబ్ సెట్ లో షూట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ పాటను అందించగా హుక్ లైన్ తో పాటు సునీల్ కశ్యప్, అజీజ్ దయాని సంగీత పర్యవేక్షకులుగా వ్యవహరించారు. దేవ్ నేగి, పావ్ని పాండే, లిజో జార్జ్ డిజె చేతాస్ హిందీ వెర్షన్ సాంగ్ ని ఆలపించగా సాహిత్యాన్ని మొహ్సిన్ షేక్, అజీమ్ దయాని అందించారు. ఇక తెలుగులో భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహెరా ఆలపించారు. తమిళ వెర్షన్ సాంగ్ ని సాగర్ అందించగా, సాగర్, వైష్ణవి కొవ్వూరి ఆలపించారు. ఇక మలయాళ వెర్షన్ లో విష్ణువర్ధన్, శ్యామ ఆలపించారు. సాహిత్యాన్ని సిజ్జు తిరువూర్ అందించారు. కన్నడ వెర్షన్ లో సంతోష్ వెంకీ, సంగీతా రవిచంద్రనాథ్ ఆలపించారు. వరదరాజ చిక్కబల్లాపుర సాహిత్యం అందించారు. దేశ వ్యాప్తంగా రీసెంట్ పోస్టర్ తో అటెన్షన్ ని క్రియేట్ చేసిన `లైగర్` టీమ్ ఆగస్టులో పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలకు సిద్ధమవుతోంది.