Begin typing your search above and press return to search.
లైగర్ ఇంకో 8నెలలు అంటే పెను సవాలే
By: Tupaki Desk | 17 Dec 2021 2:30 AM GMT25 ఆగస్టు 2022న సినిమాని రిలీజ్ చేస్తున్నామని 2021 డిసెంబర్ 31న స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేస్తామని ప్రకటించింది లైగర్ టీమ్. దీంతో పూరి కూడా పాన్ ఇండియా వార్ లోకి వచ్చేశాడని అర్థమైంది. కానీ లైగర్ కోసం ఇంకా చాలా సమయమే వేచి చూడాల్సి ఉంటుంది.
లైగర్ టీమ్ రెండు ప్రధాన అప్ డేట్ లను ప్రకటించడం ద్వారా విజయ్ దేవరకొండ అభిమానులకు పెద్ద ఊరటనిచ్చినా కానీ మూడేళ్ల పాటు వేచి చూడాల్సి రావడం చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్. పూరి లాంటి సూపర్ స్పీడ్ డైరెక్టర్ ఇంత ఆలస్యం చేయడానికి కారణం కరోనా మహమ్మారీ. షెడ్యూల్స్ ఏవీ అనుకున్న తీరుగా పూర్తి కాకపోవడం సమస్యాత్మకం అయ్యింది. లైగర్ ప్రారంభమై ఇప్పటికే మూడు సంవత్సరాలు అయ్యింది. 2019లో ప్రారంభిస్తే.. మహమ్మారి వెంటాడింది. విదేశీ షూట్ తర్వాత మరింత ఆలస్యమైంది. ఇక ఇలాంటి కమర్షియల్ సినిమా హాట్ గా విడుదల కావాలని అభిమానులు వేచి చూస్తారు. ఆలస్యమయ్యే కొద్దీ ఆసక్తి సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రమోషన్స్ తోనే సినిమాని లైవ్ లో ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ ప్రచారం పరంగానూ ఆశించిన రేంజుకు ఇంకా చేరుకోలేదు టీమ్. ఇంకో 8 నెలల పాటు ప్రమోషన్స్ పరంగా నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉంది.
కమర్షియల్ సినిమా ఎంత ఆలస్యమైతే ప్రేక్షకులు అంతగా ఆసక్తిని కోల్పోయే అవకాశాలు ఎక్కువ. విడుదల వరకు సందడి చేస్తూ హైప్ ని కొనసాగించడం మేకర్స్ కి పెద్ద పని. పూరి-ఛార్మి-కరణ్ బృందం లైగర్ కోసం ఎలాంటి ఎత్తుగడల్ని అనుసరిస్తారు? అన్నది వేచి చూడాలి.