Begin typing your search above and press return to search.
'లైగర్'లో ఆ సీన్స్ అన్నీ లేపేశారా?
By: Tupaki Desk | 30 Aug 2022 8:30 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీని పూరి, ఛార్మీలతో కలిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, అపూర్వ మొహతా నిర్మించారు. రిలీజ్ కు ముందు భారీ హంగామా చేసిన ఈ మూవీ ఆగస్టు 25న పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అయితే రిలీజ్ కు ముందున్న జోష్ రిలీజ్ తరువాత కనిపించడం లేదు.
కారణం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ మొదలైంది. పూరి మార్కు హీరోయిజమ్ ఎక్కడా కనిపించలేదని, అంతే కాకుండా పూరి జగన్నాథ్ తన పెన్నుకు పని పెట్టలేదని దాంతో ఆశించిన స్తాయిలో సినిమా లేదనే కామెంట్ లు వినిపించడం మొదలైంది.
విజయ్ దేవరకొండ లైగర్ పాత్ర కోసం కఠోరంగా శ్రమించినా అందులో పావుల వంతు కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ శ్రమించలేదని దీంతో సినిమా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుందని కామెంట్ లు చేస్తున్నారు.
రొటీన్ హీరోయిన్ లవ్ ట్రాక్, హీరోయిన్ తో హీరో తల్లికి మధ్య వచ్చే సన్నివేశాలు, హీరో, హీరోయిన్ మధ్య సాగే రొటీన్ రొమాన్స్.. పెద్దగా బలం లేని కథ, కథనాలు..ఏ విషయంలోనూ పూరి మార్కు కనిపించకపోవడంతో విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు ఈ ప్రాజెక్ట్ పై పెదవి విరుస్తున్నారు. 'లైగర్' మూవీ పరాజయానికి చాలా కారణాలున్నాయి. కీలక సీన్ లకు సంబంధించి ఎలాంటి లింక్ లు, కంటిన్యూటీ లేకపోవడం కూడా ప్రధాన లోపంగా మారింది.
ఇక తండ్రి పాత్రకు ఎలాంటి రిఫరెన్స్ ని కానీ, కనీసం ఫొటోలని కూడా చూపించకపోవడం ప్రధాన మైనస్ గా మారింది. తండ్రి పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ పెడితే కొంత ఆసక్తికరంగా వుండేది. తండ్రి లక్ష్యాన్ని సాధించడం కోసం కొడుకు రింగ్ లోకి దిగడం లా వుండేదేమో కానీ అది పూరి కంప్లీట్ గా మిస్సయ్యాడు. అయితే ఆ సీన్ లని కొన్నింటిని పూరి రాసుకున్నాడట. కొన్ని షూట్ కూడా చేశారట.
అయితే ఫైనల్ ఎడిట్ లో ఆ సీన్ లని కంప్లీట్ గా లేపేశారని తెలిసింది. ఈ సీన్ ల నిడివి దాదాపు అరగంట వుంటుందట. అయితే నిడివి ఎక్కువ అవుతుందని, ఈ సీన్ లు అవసరం లేదని షూటింగ్ కు ముందు కొన్ని.. ఎడిటింగ్ టేబుల్ వద్ద మరికొన్ని లేపేశారట. దాంతో సినిమా ఆర్డర్ తప్పింది. తండ్రికి సంబంధించిన సీన్స్ వుంటే సినిమా కొంత బెటర్ గా వుండేదేమో కానీ అది జరగలేదు. దీంతో 'లైగర్' కళతప్పింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.