Begin typing your search above and press return to search.
10పీఎం `లైగర్` స్పీడ్ ఎంతంటే?
By: Tupaki Desk | 23 Nov 2021 1:30 PM GMTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ క్లైమాక్స్ కి చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుగుతోంది. కొద్ది రోజులుగా యూనిట్ యుఎస్ ఏ లోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
విజయ్ దేవరకొండ- బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఆ షూట్ పూర్తి కావచ్చింది. తాజా అప్టేడ్ ప్రకారం విజయ్ పై నైట్ మోడ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. `లైగర్` క్లాప్ బోర్డ్ పై రాత్రి 10 గంటలు అని రాసి ఉంది. అంటే నైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే లైగర్ కి చివరి షెడ్యూల్. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం పూరికి ఇదే తొలిసారి. తనదైన శైలిలో కమర్శియలైజ్ చేసి తెరకెక్కిస్తున్నారు.
పూర్తి మార్క్ చిత్రంగానే ఫోకస్ అవుతోంది. అయితే కంటెంట్ పరంగా కొత్తదనం ఏదైనా ఉంటుందా? అంటే అది స్పోర్స్ట్ నేపథ్యం హైలైట్ అవ్వాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరి మళ్లీ గత వేగాన్ని అందుకుంటాడా లేదా? అన్నది `లైగర్` డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవలే పూరి తనయుడు ఆకాష్ నటించిన `రొమాంటిక్` ప్రేక్షకుల ముందుకొచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అనీల్ పాడూరి దర్శకత్వం వహించినా తనకు అండగా నిలిచి అంతా నడిపించింది పూరి అన్నది తెలిసిందే. ఇక `లైగర్` చిత్రాన్ని తెలుగు.. హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. పూరి-చార్మి- బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది.