Begin typing your search above and press return to search.
'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్స్ క్లూజివ్ సమాచారం..!
By: Tupaki Desk | 3 May 2022 8:35 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం ''లైగర్''. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇది వీడీ - పూరీ కలయికలో రాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.
బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన 'లైగర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో.. దీనికి హిందీలోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
'లైగర్' మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్ దాదాపు 99 కోట్లకు అమ్ముడుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో 85 కోట్లకు డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ సొంతం చేసుకోగా.. సోనీ మ్యూజిక్ కంపెనీ 14 కోట్లకు ఆడియో రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ''లైగర్'' సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ థియేట్రికల్ బిజినెస్ చేసిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాల హక్కులను డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తీసుకున్నట్లు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడు పోయాయని.. కాదు 60 కోట్లకు మాత్రమే అని టాక్ నడిచింది. అయితే మనకందిన సమాచారం కోసం 'లైగర్' మేకర్స్ తెలుగు హక్కులకు ఇంకా ఎవరికీ అమ్మలేదు. వరంగల్ శ్రీను తో డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదని తెలుస్తోంది.
ముంబై స్లమ్ ఏరియాలోని ఓ ఛాయ్ వాలా.. ప్రపంచస్థాయి బాక్సార్ గా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ''లైగర్'' చిత్రం తెరకెక్కింది. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో VD ప్రొఫెషనల్ బాక్సర్ గా సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.
విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ - రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ధర్మ ప్రొడక్షన్స్ - పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ - అపూర్వ మెహతా కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. జునైద్ సిద్దిఖీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
'లైగర్' చిత్రాన్ని 2022 ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలోకి తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు - హిందీ లతో పాటుగా తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.