Begin typing your search above and press return to search.
లైగర్ రిలీజ్ డేట్ లాక్.. గర్జించేది ఆ రోజే..!
By: Tupaki Desk | 11 Feb 2021 11:40 AM GMTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' అంటూ వచ్చిన పోస్టర్ ఆడియన్స్ ను ఏ స్థాయిలో అట్రాక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో.. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్!
లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాలూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ.. ఈ సినిమా మాత్రం స్టార్ట్ కాలేదు. చాలా ఆలస్యంగా రేపు ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. దీనికి కారణం ఉంది. ఇది ముంబై సెంటర్ సాగే కథ. దీనివల్ల ముంబైలోనే చిత్రీకరణ జరపాల్సి ఉంది. కానీ.. దేశం మొత్తంలో కరోనా తీవ్రత కాస్త తగ్గినా.. ముంబై లో మాత్రం అదుపులోకి రాలేదు. ఈ కారణంగానే ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమైంది.
ఈ చిత్రం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందన్న విషయం తెలిసిందే. దీంతో.. విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడట. పాన్-ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చార్మి - కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీంతో.. బాలీవుడ్లోనూ ఈ చిత్రానికి మంచి హైప్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ కాగా.. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ కూడా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయడానికి పూరీ సిద్ధమైనట్టు సమాచారం. ఆ తర్వాతి రోజు శుక్రవారం వినాయక చవితి సెలవు రావడం.. ఆ తర్వాత వీకెండ్ హాలీడేస్ కావడంతో.. కలెక్షన్స్ బాగుంటాయని భావిస్తోందట యూనిట్. అదేరోజున తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల రానుంది.