Begin typing your search above and press return to search.
పుష్ప కు కొద్ది దూరంలో నిలిచిన లైగర్
By: Tupaki Desk | 28 Dec 2021 4:30 AM GMTఅల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పుష్ప తో మరింత మంది ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫేస్ బుక్.. ఇన్ స్టా మరియు ట్విట్టర్ ల్లో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా సౌత్ స్టార్స్ లో అత్యధిక ఇన్ స్టా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న రికార్డును మాత్రం అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కు ఇన్ స్టా లో దాదాపుగా 14.5 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే వెళ్తుంది. కొన్ని నెలల క్రితమే కోటి మందిని దక్కించుకున్న బన్నీ తక్కువ సమయంలోనే 50 లక్షల మందిని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పుడు మరింత స్పీడ్ గా ఆయన దూసుకు వెళ్లే అవకాశం ఉంది. పుష్ప సినిమా తో బాలీవుడ్ లో మనోడికి మరింత గుర్తింపు వచ్చింది. ఒక వైపు బన్నీ స్పీడ్ గా తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వెళ్తుంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంతకు మించిన స్పీడ్ తో దూసుకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. త్వరలోనే బన్నీని కూడా విజయ్ దేవరకొండ ఇన్ స్టా లో ఫాలోవర్స్ సంఖ్య విషయంలో క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. అల్లు అర్జున్ కంటే కేవలం నాలుగు లక్షల ఫాలోవర్స్ మాత్రమే రౌడీ స్టార్ కు తక్కువగా ఉన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్స్ కు పెరిగింది.
గత రెండేళ్లుగా ఆయన సినిమాలు ఏమీ లేవు. అయినా కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా సినిమా గా రూపొందుతున్న లైగర్ కనుక విడుదల అయ్యి అక్కడ ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఖచ్చితంగా రౌడీ స్టార్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వచ్చే ఏడాదికి ఆయన మరో ఆరు మిలియన్స్ ను దక్కించుకుని 20 మిలియన్ ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ కు చాలా సమీపంలో ఉన్న విజయ్ దేవరకొండ అతి త్వరలోనే ఆయన్ను క్రాస్ చేస్తాడా అనేది చూడాలి.