Begin typing your search above and press return to search.
#లైగర్.. ఇంతకీ ఎవరు బెస్ట్ స్టైలిష్ ఐకన్?
By: Tupaki Desk | 18 March 2022 5:46 AM GMTనిర్మాత అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబై లో జరిగిన వేడుకకు విజయ్ దేవరకొండ- అనన్య పాండే- పూరీ జగన్నాధ్- ఛార్మి కౌర్ ప్రత్యేక ఆకర్షణను తెచ్చారనడంలో సందేహం లేదు. ఈవెంట్ ఆద్యంతం కళ్లన్నీ ఈ టీమ్ పైనే. నిజానికి పాన్ ఇండియా లుక్ తో మైండ్ బ్లాక్ చేసాడు పూరి. ఇక అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. తన పక్కనే అనన్య పాండే ఉన్నా అతడి ముందు ఇంకెవరూ నిలవలేదంటే అతిశయోక్తి కాదు.
ఈరోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా కోసం బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు. అటు బాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయిన ఈవెంట్లో ఎవరు బెస్ట్ స్టైల్ ఐకన్ అంటూ చర్చ సాగింది. ముఖ్యంగా లైగర్ టీమ్ ఎంత స్టైలిష్ గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేడుక ఆద్యంతం లైగర్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజయ్ దేవరకొండ- అనన్య పాండే- పూరీ జగన్నాధ్ - ఛార్మి కౌర్ నలుపు దుస్తులలో కనిపించారు. ముదురు రంగు థీమ్ ఈవెంట్ కోసం నిర్ధేశించిన డ్రెస్ కోడ్. బ్లాక్ జాకెట్.. బ్లాక్ ప్యాంట్ లో కనిపించిన విజయ్ కూల్ వైబ్ తో ఆకర్షించాడు. మరోవైపు అనన్య పాండే అభిమానుల గుండెలను తాకేలా పూర్తిగా మనసుకు హత్తుకునేలా కనిపించింది. తాజా ఈవెంట్ అనంతరం సోషల్ మీడియాలో పూరి టీమ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బెస్ట్ స్టైలిష్ టీమ్ అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు. #లైగర్.. ఎవరు బెస్ట్ స్టైలిష్ తేల్చేదెలా దేవుడా?..దేవుడా నువ్వు బావుండు! అంటూ పూరి ఏంటిలా!.. నువ్వే బావుండు అంటూ పూరి బావున్నాడు!.. అంటూ రకరకాల పంచ్ లు విసిరేస్తున్నారు సరదాగా!
లైగర్ విషయానికి వస్తే.. సినిమా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కొనసాగుతున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.