Begin typing your search above and press return to search.

'లైగర్' USA ప్రీమియర్ టాక్..!

By:  Tupaki Desk   |   25 Aug 2022 3:34 AM GMT
లైగర్ USA ప్రీమియర్ టాక్..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌ లో తెరకెక్కిన మోస్ట్ ఎవెయిటింగ్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ''లైగర్''. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈరోజు గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతకంటే ముందుగా ఈ సినిమా యూఎస్ఏలో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది.

'లైగర్' చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌ గా నటించగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

VD చివరి సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' డిజాస్టర్ అయినా.. 'ఇస్మార్ట్ శంక‌ర్' త‌ర్వాత పూరి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో ''లైగ‌ర్‌'' సినిమాకు మంచి బ‌జ్ ఏర్పడింది. దీనికి త‌గిన‌ట్టుగానే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జ‌రిగాయి. అయితే యూఎస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.

'లైగర్' ఫస్టాఫ్ అంతా ఏమాత్రం ఆకట్టుకోని యావ‌రేజ్ సీన్ల‌తో కథకు అంతగా ప్రాధాన్యత లేకుండా సాగిందని అంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. విజయ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించాడు. కాకపోతే నత్తితో మాట్లాడటం వీడీ కి పూర్తి స్థాయిలో సెట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి.

అక్కడక్కడా కొన్ని డైలాగులు వర్కౌట్ అయినప్పటికీ.. హీరో ఎక్కువగా తడబడుతూ చెప్పడం వల్ల స్పీడ్ బ్రేకర్‌ గా మారినట్లు అనిపించిందని అంటున్నారు. విజ‌య్ న‌త్తిగా మాట్లాడ‌డం మొదట్లో బాగున్నా.. త‌ర్వాత క‌థ సాగుతున్న కొద్ది అది బాగా బోర్ కొట్టేసింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ప్రధాన జోడీ అన‌న్య పాండే - విజ‌య్ మధ్య ల‌వ్ ట్రాక్ ని పూరి చాలా పేలవంగా రాసుకున్నాడని చెబుతున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ చాలా యావరేజ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం కూడా అంతగా పేలలేదని అంటున్నారు. ఫైట్స్‌ - ర‌మ్య‌కృష్ణ ఎంట్రీ - VD పెర్ఫార్మన్స్ మాత్ర‌మే ఫ‌స్టాఫ్‌ లో చెప్పుకోద‌గ్గవని పేర్కొంటున్నారు.

విజయ్ - రమ్యకృష్ణ మధ్య మదర్ సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ.. అక్కడక్కడా రమ్య కృష్ణ నటన ఓవర్ అయ్యిందని కామెంట్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ షురూ చేస్తాడు. పూరీ మార్క్ యాక్షన్ తో అలరించే ప్రయత్నం చేశారు.

ఓవ‌రాల్‌ గా చూస్తే సినిమా ఊహాజ‌నిత‌మైన ప్లాట్‌ తో సాదా సీదా చిత్రంగా పూరీ జగన్నాథ్ 'లైగర్' ను తెరకెక్కించారని ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ అంటున్నారు. చాలా సీన్స్ లో రొటీన్ కంటెంట్ తో బోర్ గా ఫీల్ అయ్యేలా చేశాడని కామెంట్ చేస్తున్నారు.

'లైగర్' విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా మూవీగా పడాల్సిన చిత్రం కాదని ట్వీట్లు పెడుతున్నారు. విజ‌య్ న‌ట‌న‌ మరియు అతని క్యారెక్ట‌రైజేష‌న్ మాత్ర‌మే సినిమాకు ప్ల‌స్‌ గా చెబుతున్నారు. అనన్య పాండే పాత్ర ఈ సినిమాకు బిగ్ మైనస్ గా పేర్కొంటుండగా.. మైక్ టైసన్ పాత్ర కూడా హై ఇవ్వలేకపోయిందని అంటున్నారు.

మొత్తంగా చూస్తే 'లైగ‌ర్' ప్రీమియ‌ర్ షోల తర్వాత హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ హిట్టు.. డైరెక్టర్ గా పూరీ ఫెయిల్ అయ్యాడ‌నే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సరైన మాస్ చిత్రం లేకపోవడం.. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటం లైగర్ కి కలసి వచ్చే అంశాలు. మ‌రి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి నంబట్స్ అందుకుంటుందో చూడాలి.