Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో మరోసారి సమ్మె సైరన్!
By: Tupaki Desk | 25 April 2018 7:51 AM GMTడిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు(డీఎస్పీ), నిర్మాతల మండలికి మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఈ ఏడాది మార్చి మొదటి వారంలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా థియేటర్లు బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకు టాలీవుడ్ లో ....సమ్మె విరమించడంతో థియేటర్లు తెరుచుకున్నాయి. కొద్ది రోజుల క్రితం తమిళనాడు లో కూడా సమ్మె ఆగడంతో అక్కడి థియేటర్లలో సందడి మొదలైంది. అయితే, తాజాగా మరోసారి టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్ లో లైట్ మెన్ లు బంద్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వేతనాల పెంపు విషయంలో నిర్మాతల మండలికి - లైట్ మెన్లకు మధ్య తాజాగా జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె తప్పదని పుకార్లు వినిపిస్తున్నాయి.
చాలా కాలంగా తమ వేతనాలు పెంచలేదని, వాటిని పెంచకుంటే సమ్మెకు దిగుతామని నిర్మాతలకు లైట్ మెన్లు...కొద్ది రోజుల క్రితం నోటీసులు పంపారు. అదనపు షిఫ్టుల్లో పనిచేస్తున్నా జీతాలు- బేటాలూ సరిగా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో, త్వరలోనే 25 శాతం వేతనాలు పెంచుతామని, నిర్మాతలు హామీ ఇవ్వడంతో లైట్ మెన్లు .....సమ్మె నిర్ణయాన్ని వాపసు తీసుకున్నారు. అయితే - 25 శాతానికి బదులుగా కేవలం 12 శాతమే జీతాలు పెంచడంతో లైట్ మెన్లు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో, హుటాహుటిన లైట్ మెన్లతో నిర్మాతల మండలి కీలక సమావేశం నేడు నిర్వహించారు. కానీ, ఈ సమావేశంలో చర్చలు విఫలం కావడంతో లైట్ మెన్ సమ్మెకు దిగాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి లైట్ మెన్లతో నిర్మాతలు చర్చలు జరిపి సమ్మెను ఆపే ప్రయత్నం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు సమ్మెపై లైట్ మెన్ల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.