Begin typing your search above and press return to search.
వెన్నెల్లో ఆడ పిల్లలా బంగారు బొమ్మలా..!
By: Tupaki Desk | 3 Sep 2022 5:17 AM GMTసందర్భానికి తగ్గట్టు డ్రెస్సింగ్ సెన్స్ తో ఆకట్టుకోవడం మన కథానాయికల ప్రత్యేకత. రొటీన్ గ్లామరస్ లుక్ కి భిన్నంగా ట్రెడిషనల్ అవతార్ లో కనిపించడమెలానో శ్రద్ధా కపూర్ లాంటి ట్యాలెంటెడ్ గాళ్ ని చూసి నేర్చుకోవాలి. తాజాగా ఈ బ్యూటీ గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఎంతో ప్లెజెంట్ లుక్ తో ఆకట్టుకుంది.
ఆగస్టు అంతా బాలీవుడ్ తారల గృహాల్లో రకరకాల పండగలతో సందడి నెలకొంది. నవరాత్రులు రాబోతున్నందున ఈ నెల కూడా అంతే సంతోషంగా సరదాగా సందడి కనిపిస్తోంది. ఇప్పుడు గణపతి బప్ప మోరియో అంటూ ఒకటే సందడి నెలకొంది. తాజాగా సాహో నటి శ్రద్ధా గణేష్ చతుర్థి నాడు మోదకాలతో సందడి చేసింది. ఎరుపు -ఆకుపచ్చ పట్టు చీరలో ఇంతకుముందు ఫోటోషూట్ లో పాల్గొంది. గణేష్ విగ్రహం ముందు స్వీట్లు పంచుతూ కనిపించింది.
ఈ వేడుకల్లో భాగంగా వైట్ అండ్ వైట్ కుర్తాలో కూడా కనిపించింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ నమ్రతా దీపక్ ఆమెను బేగం ప్రెత్ క్రియేషన్ లో తీర్చిదిద్దారు. బేగం ప్రెత్ కుర్తా లో శ్రద్ధా ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపిస్తోంది. స్టైల్ ఎలివేషన్ పరంగానూ ఈ లుక్ లో ఆకర్షణ పరంగా తక్కువేమీ లేదు. ఎంతో మనోహరంగా కనిపిస్తున్న శ్రద్ధాను పొగిడేయకుండా యూత్ ఆగలేకపోతోంది. ఈ డ్రెస్ ఖరీదు రూ. 23500. శ్రద్ధా తన OOTDని బిందీ - పింక్ మ్యాట్ లిప్ స్టిక్ తో సింపుల్ గా కనిపించింది. వెన్నెల్లో ఆడ పిల్లలా బంగారు బొమ్మలా..! కనిపిస్తోందంటూ తెలుగు యువత శ్రద్ధాపై ప్రశంసలు కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
కెరీర్ ఆరంభమే ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఆషికి 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రద్ధా తరువాత స్త్రీ- హైదర్- స్త్రీ- ఏక్ విలన్- చిచోరే- ABCD: ఏ బాడీ కెన్ డ్యాన్స్ వంటి చిత్రాలలో పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల పెద్ద తెరపై కనిపించి చాలా కాలమైంది. శ్రద్ధ చివరిగా 2020 చిత్రం టైగర్ ష్రాఫ్- రితీష్ దేశ్ముఖ్ -అంకితా లోఖండేలతో కలిసి 'బాఘీ 3'లో కనిపించింది. ఇది కాకుండా.. నటి నిఖిల్ ద్వివేది - విశాల్ ఫ్యూరియా 'నాగిన్' లో కూడా భాగం అవుతుంది. ఇది 1989 నాటి స్లాప్ స్టిక్ చిత్రం 'చాల్ బాజ్' కి మోడ్రన్ రీమేక్. శ్రద్ధా తన కెరీర్ లో ఎన్నడూ చూడని అవతార్ లో కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆకారాన్ని మార్చుకునే పాము పాత్రలో కనిపిస్తుంది. సాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన శ్రద్ధాకు తెలుగులోనూ ఫాలోయింగ్ పెరిగింది.
లవ్ రాంజాన్ తో సినిమా.. రణబీర్ కపూర్ - శ్రద్ధా కపూర్ జంటగా లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న తదుపరి చిత్రం సెట్స్ లో ఇటీవలి అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత శ్రద్ధా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.