Begin typing your search above and press return to search.

అఖండ మాదిరిగా 'వీర సింహారెడ్డి' కూడా అక్కడే..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 3:55 AM GMT
అఖండ మాదిరిగా వీర సింహారెడ్డి కూడా అక్కడే..!
X
నందమూరి బాలకృష్ణ గత ఏడాది డిసెంబర్‌ నెలలో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా దాదాపుగా రూ.200 కోట్ల రూపాయలను వసూళ్లు చేసిందట. ఇక స్టార్‌ మాలో వరల్డ్‌ ప్రీమియర్‌ అయిన సమయంలో కూడా భారీ ఎత్తున రేటింగ్‌ వచ్చింది. అఖండ వల్ల స్టార్‌ మాకి భారీ గా లాభం వచ్చిందనే టాక్‌ వచ్చింది.

అఖండ వల్ల దక్కిన లాభాల కారణంగా ఇప్పుడు బాలయ్య నటిస్తున్న వీరసింహా రెడ్డి సినిమాను కూడా స్టార్‌ మా దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. భారీ మొత్తానికి స్టార్‌ మా వారు ఈ సినిమాను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు శాటిలైట్‌ మరియు ఓటీటీ రైట్స్ తో భారీ మొత్తానికి మూట కట్టుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

సినిమా పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో మరియు బుల్లి తెరపై బాలయ్య కు ఉన్న స్టార్‌ డమ్‌ మరియు క్రేజ్ నేపథ్యంలో స్టార్‌ మా వారు ఈ సినిమాను గట్టి పోటీలో తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. స్టార్‌ మా లో టెలికాస్ట్‌ అవుతున్న అఖండ సినిమాకు ఇంకా కూడా మంచి రేటింగ్‌ వస్తుంది.

కనుక వీర సింహా రెడ్డి సినిమా కూడా స్టార్‌ మాకు మంచి రేటింగ్ ను తెచ్చి పెట్టడం ఖాయం. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయ్యి ఎక్కువ మంది చూసిన తర్వాత శాటిలైట్‌ లో ఎక్కువ చూడటం లేదు. అందుకే టీవీ ల రేటింగ్ గతంతో పోల్చితే ఎక్కువ రావడం లేదు. అయినా కూడా వీర సింహారెడ్డి సినిమాను స్టార్‌ మా భారీ రేటుకు కొనుగోలు చేసింది.

స్టార్‌ మా ఈ సినిమా యొక్క శాటిలైట్‌ రైట్స్ ను కొనుగోలు చేసింది కనుక ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు కొనుగోలు చేసి ఉంటారు. రెండు రైట్స్ ను స్టార్‌ వారు ఎక్కువ శాతం జాయింట్ గా కొనుగోలు చేస్తే ఉంటారు. అఖండ సినిమా స్టార్ మాలో టెలికాస్ట్‌ అవ్వగా అంతకు ముందే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అయ్యింది. కనుక వీర సింహారెడ్డి కూడా అక్కడే స్ట్రీమింగ్ అయ్యి టెలికాస్ట్‌ అవ్వబోతుంది.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా గోపీచంద్‌ గతంలోనే పేర్కొన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.