Begin typing your search above and press return to search.
చిరు- కమల్ లానే పవన్ బ్యాలెన్స్ చేయాలి
By: Tupaki Desk | 4 Nov 2022 3:30 AM GMTసినిమా తారలు రాజకీయాల్లోకి రావడం సహజం. కానీ రాజకీయాల్లో నెగ్గడం అంత సులువైన విషయం కాదు. అలాంటి అనుభవాలు మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్... విశ్వనటుడు కమల్ హాసన్.. విజయ్ కాంత్ లాంటి ఎందరో స్టార్లు చవి చూశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం గురించి ఆలోచించి బ్యాక్ స్టెప్ తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అయితే చిరంజీవి తిరిగి 'ఖైదీ నంబర్ 150'తో టాలీవుడ్ లో కంబ్యాక్ అయిన తీరు సంచలనమైంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరు ఆ తర్వాత పార్టీని రూపు మాపి.. కాంగ్రెస్ లో చేరారు. తర్వాత కాలక్రమంలో ఇక రాజకీయాలతో సంబంధం లేకుండా ఇప్పుడు పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారు. వరుసగా సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్లతో అభిమానులను అలరిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల్లోకి ఇది గ్రేట్ కంబ్యాక్ అని చెప్పాలి.
ఇక విశ్వనటుడు కమల్ హాసన్ సైతం రాజకీయాల్లోకి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆయన 'మక్కల్ నీది మయ్యమ్' అనే రాజకీయ పార్టీని స్థాపించినా తమిళనాడు ఎన్నికల్లో ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు. ప్రస్తుతం అతడు పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారిస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గాను బుల్లితెర అభిమానులను అలరిస్తున్నారు. ఇక కొన్ని వరుస డిజాస్టర్ల తర్వాత 'విక్రమ్' సినిమాతో సంచలన విజయం అందుకుని అతడు కంబ్యాక్ అయిన తీరు ఆసక్తిని కలిగించింది. కమల్ ఇక సినిమాలు చేస్తారా లేదా? అని బెంగ పట్టుకున్న వేళ అభిమానులకు విక్రమ్ రూపంలో గొప్ప ఊరట లభించింది. కమల్ తనదైన విలక్షణమైన ఆహార్యంతో మరోసారి దుమ్ము దులిపాడు. ఇప్పుడు విక్రమ్ 2 కోసం అతడు సన్నాహకాల్లో ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ తో సీక్వెల్ కోసం మంతనాలు సాగుతున్నాయి.
మరోవైపు కమల్ భారతీయుడు 2 తో తిరిగి తన ఫామ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాలని కసితో ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం పూర్తి కానుంది. అయితే లోకేష్ కనగరాజ్ రకరకాల ప్రాజెక్టులతో బిజీగా ఉండడం... కమల్ ఇతర షెడ్యూళ్లతో ఠిఫికల్ గా ఉండడంతో ఇప్పుడు కమల్ హాసన్ ప్లానింగ్ మారుతోందని సమాచారం. అతడి జాబితాలో మరో ప్రముఖ దర్శకుడి పేరు వినిపిస్తోంది. అతడే హెచ్ వినోద్. అజిత్ తో నీర్కొండ పారై -వాలిమై లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన వినోద్ తదుపరి తునివు అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలున్నాయి. అతడు కమల్ కోసం అద్భుతమైన కథను రెడీ చేస్తున్నారని టాక్ ఉంది. కనగరాజ్ తో విక్రమ్ 2 కంటే వినోద్ తో మూవీ ముందుగా సెట్స్ కెళ్లే వీలుందని చెబుతున్నారు. ఏది ఏమైనా కమల్ హాసన్ కంబ్యాక్ లో ఒక్కో మెట్టును అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన వేళ విక్రమ్ తో అతడి పునరాగమనం అదిరింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి..లోకనాయకుడు కమల్ హాసన్ తరహాలోనే ఇప్పుడు మరో స్టార్ హీరో కంబ్యాక్ కోసం అభిమానులు అంతే ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడమే ఒక సంచలనం. జనసేనానిగా ప్రజల మనసులు దోచిన పవన్ పార్టీ బలం పెంచడంలో సఫలమవుతున్నాడు. రానున్న ఎన్నికలకు చాలా ముందే అతడి వ్యూహాలు పదును తేరుతుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే రాజకీయాల్లో పవన్ ఆరంభం పరాభవం ఎదుర్కొన్నా తెలివిగా మొండిగా వేగంగా తిరిగి కంబ్యాక్ కోసం ప్రయత్నించడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల సంగతి ఎలా ఉన్నా కానీ ఇప్పుడు అతడు సినిమాల్లోను సత్తా చాటి కంబ్యాక్ ని అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవర్ స్టార్ నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ చిత్రం 'హరి హర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రంతో హిందీలోను పవన్ పెద్ద మార్కెట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వకీల్ సాబ్ గా అదరగొట్టి భీమ్లా నాయక్ గా గ్రేట్ కంబ్యాక్ చూపించినా కానీ ఇప్పుడు సెట్స్ లో ఉన్న సినిమాలతో మళ్లీ బ్లాక్ బస్టర్లు అందుకుని పవన్ తన స్థానం ఇతర హీరోలకు ధీటుగానే ఉందని నిరూపించాల్సి ఉంది. విక్రమ్ తో కమల్ హాసన్ ఎలాంటి సౌండ్ చేశారో ఆ రేంజులో పవన్ కూడా అదిరే బ్లాక్ బస్టర్ తో నిరూపించాల్సి ఉంది.
రాజకీయాలు- సినిమాలు రెండు పడవలు అయినా కానీ రెండిటినీ సజావుగా నడిపించడంలో పవన్ తన ధీరోధాత్తతను చాటుకోవాల్సి ఉందని కూడా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.