Begin typing your search above and press return to search.
మణిరత్నంలా శంకర్ కూడా ఓ ఫేమస్ నవలపై కన్నేశాడు!
By: Tupaki Desk | 8 Nov 2022 3:54 AM GMTదక్షిణాదిలో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు శంకర్. అయితే 'బాహుబలి' తరువాత శంకర్ పై వున్న దృష్టి కాస్త రాజమౌళి వైపు మళ్లింది. ఈ మూవీ తరువాత ప్రతీ దేశ వ్యాప్తంగా వున్న ప్రతీ మేకర్ టాలీవుడ్ వైపు ఆసక్తాగా చూడటం మొదలు పెట్టారు. పాన్ ఇండియా సినిమాల పరంపర కూడా భారీ స్థాయిలో మొదలవ్వడంతో చాలా మంది దర్శకులు రాజమౌళిని ఫాలో కావడం మొదలు పెట్టారు. ఇటీవల మణిరత్నం కూడా 'పోన్నియిన్ సెల్వన్'ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇదే రేసులో త్వరలో మాస్టర్ డైరెక్టర్ శంకర్ కూడా నిలవబోతున్నాడట. ఇందులో భాగంగానే శంకర్ కూడా 'బాహుబలి' లాంటి సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మణిరత్నం రీసెంట్ గా తమిళంలో బహుళ ప్రాచూర్యం పొందిన కల్కీ కృష్ణమూర్తి ఫేమస్ నవల 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' ని రెండు భాగాలు గా తెరకెక్కించారు. ఇందులో ఫస్ట్ పార్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1' విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ కేవలం తమిళ వెర్షన్ లో మాత్రమే రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. కారణం తమిళులకు మాత్రమే కనెక్ట్ అయ్యే నవల కావడంతో 'పొన్నియిన్ సెల్వన్ 1' తెలుగుతో పాటు ఇతర భాషల్లో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పడు అలాంటి ఓ ఫేమస్ నవలని శంకర్ తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాడట. తమిళంలో పాపులర్ అయిన ఇతిహాస నవల 'వేల్పరి'ని తెరపైకి తీసుకురానున్నారని తెలుస్తోంది.
అయితే ఇది పెద్ద నవల కావడంతో దీన్ని మూడు పార్ట్ లుగా చేయాలని శంకర్ నిర్ణయించుకున్నాడట. ఇందులో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటించనున్నాడని తెలిసింది. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో విజువల్ వండర్ గా ఈ మూవీని మూడు భాగాల్లో ప్రధాన భారతీయ భాషల్లో తెరపైకి తీసుకురానున్నారట. భారీ స్పాన్ వున్న కథ కావడంతో దీన్ని ఒకే పార్ట్ లో చెప్పడం కష్టం. అది గమనించిన శంకర్ ఈ కథని మూడు భాగాలుగా విభజించి శంకర్ అందుకు సంబంధించిన స్క్రీన్ ప్లేని రెడీ చేశారట.
ఈ మూడు భాగాల్లో ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది మిడ్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ కానుందని చెబుతున్నారు. శంకర్, రణ్ వీర్ సింగ్ కలిసి ఇంతకు ముందు 'అపరిచితుడు' రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టి ఈ భారీ ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురాబోతున్నారని తెలిసింది. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో RC 15, కమల్ హాసన్ తో 'ఇండియన్ 2' మూవీస్ ని తెరకెక్కిస్తున్నారు. రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం రోహిత్ శెట్టితో కలిసి 'సర్కస్', కరణ్ జోహార్ తో 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' మూవీస్ చేస్తున్నాడు.
ఇదిలా వుంటే మణిరత్నం తమిళ నవల ఆశించిన స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా ఆకట్టుకోలేక పోయింది. కారణం అది తమిళులకు మాత్రమే పరిమితమైన కథ కావడం.. ఇప్పడు శంకర్ చేయాలనుకున్న 'వేల్పరి' కూడా తమిళుల నేటివిటీతో సాగుతూ వాళ్లు మాత్రమే ఓన్ చేసుకునే నవల.. మరి శంకర్ తమిళ నేటివిటీకి మాత్రమే పరిమితం అయ్యే నవలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడా ? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.