Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఫన్ - యాక్షన్ ఎంటర్టైనర్ గా 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'

By:  Tupaki Desk   |   25 Oct 2022 6:50 AM GMT
ట్రైలర్ టాక్: ఫన్ - యాక్షన్ ఎంటర్టైనర్ గా లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్
X
యంగ్ హీరో సంతోష్ శోభన్ - 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్''. మేర్లపాక గాంధీ ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించారు.

వైవిధ్యమైన టైటిల్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు.

ట్రైలర్ లోకి వెళ్తే.. సంతోష్ శోభన్ కోపంగా ఎవరినో తరుముకుంటూ వస్తుండగా.. 'ఇలా పిచ్చి కోపంతో పరుగెడుతున్న నేనొక ట్రావెల్ బ్లాగర్ ని' అంటూ హీరో పాత్రని పరిచయం చేయడంతో ప్రారంభమైంది.

సంతోష్ శోభన్ తన యూట్యూబ్ ఛానెల్‌ కు సబ్‌స్క్రైబర్స్ ను పెంచుకోవడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోడానికి ప్రయత్నించే ట్రావెల్ బ్లాగర్‌ గా కనిపించాడు. అతను తన తదుపరి ట్రావెల్ వీడియో షూట్ కోసం స్నేహితుడు నెల్లూరు సుదర్శన్‌ తో కలిసి ప్రయాణిస్తున్నాడు.

అయితే ఈ ప్రయాణంలో సంతోష్ అందాల భామ ఫరియా అబ్దుల్లా ను కలుసుకొని ప్రేమలో పడేయాలని ట్రై చేస్తున్నాడు. ఆమె వేస్ట్ ఫెలో అన్నదని సుదర్శన్ కు చెప్పి ఏడ్చే సీన్.. ఫారియా తో చెంపదెబ్బ తిన్న తర్వాత చెప్పే డైలాగ్స్ నవ్వు తెప్పోస్తున్నాయి.

ఇదిలా ఉంటే, సంతోష్ తన ఛానెల్ కోసం సెన్సేషనల్ కంటెంట్‌ ను సృష్టించే ప్రక్రియలో ఒక పెద్ద రిస్క్ తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే అది అతనితో పాటుగా ఫరియాకు కూడా ప్రమాదంలో పడేసింది. పోలీసులు - నక్సలైట్స్ మధ్య జరిగే వార్ లో ఇరుక్కుపోయేలా చేసిందని తెలుస్తోంది.

సంతోష్ నటించిన 'ఏక్ మినీ కథ' కు స్టోరీ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఈసారి ఒక ఆకర్షణీయమైన సబ్జెక్ట్ ని డీల్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఫన్ - రొమాన్స్ తో పాటుగా క్రైమ్ - యాక్షన్ అంశాలు కూడా ఉండేలా చూసుకున్నాడు. ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసాడు.

ఇందులో సంతోష్ శోభన్ ఎప్పటిలాగే కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఫరియా అబ్దుల్లా తన పాత్రలో కూల్‌ గా కనిపించింది. సీరియస్ సిట్యుయేషన్స్‌ లోనూ కామెడీ పండించే సరదా పాత్రలో బ్రహ్మాజీ.. హీరోతో పాటుగా ట్రావెల్ అయ్యే పాత్రలో సుదర్శన్ మెప్పించారు. ఆడుకాలం నరేన్ - మైమ్ గోపి - సప్తగిరి - మిర్చీ కిరణ్ తదితరులు ఇతర క్యారెక్టర్స్ లో నటించారు.

'శ్యామ్ సింగరాయ్‌' తర్వాత నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో ఆముక్త క్రియేషన్స్ తో కలిసి వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు - రామ్ మిరియాల సంగీతం సమకూర్చారు. వసంత్ సినిమాటోగ్రాఫర్ గా. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు.

''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'' చిత్రాన్ని నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నారు. 'ఏక్ మినీ కథ' తర్వాత మరోసారి కలిసి పనిచేసిన సంతోష్ శోభన్ మరియు మేర్లపాక గాంధీకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.