Begin typing your search above and press return to search.

హాలీవుడ్ లోనూ ట్యాక్సులు ఎగ్గొడతారు

By:  Tupaki Desk   |   28 Dec 2017 4:43 PM GMT
హాలీవుడ్ లోనూ ట్యాక్సులు ఎగ్గొడతారు
X
మన దగ్గర జనాలు పన్నులు ఎగ్గొట్టడం కోసం ఉపయోగించేటన్ని తెలివితేటలు.. బహుశా మరెందుకూ ఉపయోగించరేమో అనడం అతిశయోక్తి ఏమీ కాదు. ఎంతగా ఆదాయం సంపాదించినా.. కాసింత పన్ను ఎగవేత కోసం అడ్డమైన రూట్స్ అన్నీ ఫాలో అవుతుంటారు. రీసెంట్ గా పాండిచెర్రీలో అమలాపాల్ తన కార్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా 20 లక్షల రూపాయల పన్ను తగ్గించుకోవడం ఇలాంటి వాటిలో ఒకటి. ఇక పారితోషికం విషయంలో అయితే.. వైట్- బ్లాక్ అని సెపరేట్ అకౌంట్స్ మెయింటెయిన్ చేసేస్తుంటారు చాలా మంది స్టార్లు.

వ్యవస్థలో ఉన్న లొసుగులను ఇలా వాడుకుంటారని.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా కుదరదని అనుకోవడం సహజం. కానీ హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ కూడా పన్ను ఎగవేతదారుల జాబితాలో ఉందట. రీసెంట్ గా పీపుల్ మ్యాగజైన్ ఈ విషయాన్ని బైట పెట్టింది. కొన్నేళ్లు సక్రమంగానే ట్యాక్స్ చెల్లించిన ఈమె.. 2010-2014-2015 లలో మాత్రం పన్ను ఎగవేసేందుకు రకరకాల మార్గాలను వెతికిందట. ఇలా చేయడం ద్వారా ఏకంగా లక్ష డాలర్లకు పైగా చెల్లించాల్సిన ట్యాక్స్ ను ఎగ్గొట్టిందట.

యాక్షన్ ఫిలిం మాచెట్.. 2బ్రోక్ గాళ్స్ లో క్యామియో చేసినందుకు గాను అందుకున్న పారితోషికాన్ని తక్కువ చేసి చూపడం ద్వారా ఈ పన్ను ఎగ్గొట్టిందట లిండ్సే. మొత్తానికి మన దగ్గర మాత్రమే కాదు.. అంతా పారదర్శకం అని హంగామాగా చెప్పుకునే హాలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ ఉందంటే ఆశ్చర్యకరమే. లిండ్సే పేరుతో ప్రదర్శితమయ్యే టీవీ సిరీస్ లోనూ కనిపించే లిండ్సే లోహన్.. ప్రస్తుతం లండన్-దుబాయ్ ల చుట్టూ చక్కర్లు కొడుతోంది.