Begin typing your search above and press return to search.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైన 'లింగోచ్చా' ట్రైలర్..!
By: Tupaki Desk | 23 Oct 2020 11:30 AM GMT'కేరాఫ్ కంచెరపాలెం' చిత్రంలో జోసెఫ్ గా నటించి ప్రసంశలు అందుకున్న కార్తిక్ రత్నం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''లింగొచ్చా''. 'గేమ్ ఆఫ్ లవ్' అనేది ఉపశీర్షిక. సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ బడా దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బాక్స్ స్టూడియోస్ సమర్పణలో శ్రీకళ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాదీ అయిన డైరెక్టర్ ఆనంద్ బడా ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన లింగోచ్చా గేమ్ నేపథ్యంలో కొన్ని యదార్ధ సంఘటనలు ఇచ్చిన స్పూర్తితో ఒక చక్కటి ప్రేమకథని రాసుకుని తెరకెక్కించారు. లింగోచ్చా ఆటను ఏడు పెంకులాట - పిటో - సెవెన్ స్టోన్స్ అని ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. 'లింగోచ్చా' అనే డిఫెరెంట్ టైటిల్ తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో దసరా కానుకగా ఈరోజు 'లింగోచ్చా' ట్రైలర్ ని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
'లింగోచ్చా' ట్రైలర్ ''ఆజ్ కీ తాజా కబర్.. శివ గండిపురి చార్మినార్ కా లవ్ స్టోరీ'' అంటూ ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. ''హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తంలో గాని లెక్క కటింగ్ చేసేవాడు లేడు.. ఉత్త కటింగే కాదు.. తాగి తిని దుంకులాటల్లో కూడా తోప్ అన్నట్టు..'' అని హీరో క్యారక్టర్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ''ఈ ముచ్చట పక్కబెడితే వాడో పోరీని లవ్ చేసిండు.. పోరి అంటే అట్లగిట్ల ఉండదు కిర్రాక్ ఉంటది.. ఆ పోరి వెనుకబడితే వాళ్ళ అన్న గొట్టిండు.. కాలేజీలో పోరలు కొట్టిండ్రు.. పోలీసులు కొట్టిండ్రు.. ఆఖరికి ఆ పోరీ కూడా కొట్టింది..'' అంటూ చెప్పి ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఇందులో కార్తీక్ రత్నం 'ధగడ్ శివ' పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి బికాజ్ రాజ్ సంగీతం అందించారు. బెబీ ఫిదా మొగల్ - మాస్టర్ ప్రేమ్ సుమన్ - ఉత్తేజ్ - తాగుబోతు రమేశ్ - కునాల్ కౌశిక్ - బల్వీర్ సింగ్ - సద్దామ్ హుస్సేన్ - మిమిక్రి మూర్తి - ధీర్ చరణ్ శ్రీవాస్తవ్ - ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.