Begin typing your search above and press return to search.
బాహుబలి బాలేదన్నారు-లింగుస్వామి
By: Tupaki Desk | 19 July 2015 8:54 AM GMTబాహుబలి కోసం తానెంతో ఆసక్తిగా ఎదురు చూశానని.. ఐతే సినిమా విడుదలైన తొలి రోజు టాక్ కోసం హైదరాబాద్ లో ఓ వ్యక్తికి ఫోన్ చేస్తే బాలేదన్నట్లుగా చెప్పారని.. కానీ తెరమీద బాహుబలి చూస్తే అద్భుతంగా అనిపించిందని ప్రముఖ తమిళ దర్శకుడు, నిర్మాత లింగుస్వామి చెప్పాడుచెన్నైలో జరిగిన బాహుబలి థ్యాంక్స్ మీట్ కు అతిథిగా హాజరైన లింగుస్వామి ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారతీయ సినిమాకు 2015 గోల్డెన్ ఇయర్. దీనికి కారణం బాహుబలి సినిమానే. ఈ సినిమాలో అంత గ్రాండియర్ కనిపిస్తోంది. రాజమౌళి ఇండియాలో బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో మిగతా విషయాల కంటే కూడా పోటీని, అసూయను జయించాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి వాటన్నింటినీ అధిగమించి బాహుబలి అవతార్ స్థాయికి చేరుకుంది. బాహుబలి పేరు ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తోంది. తొలి రోజు హైదరాబాద్ లో ఓ వ్యక్తికి ఫోన్ చేసి సినిమా గురించి అడిగితే.. బాలేదన్నట్లు చెప్పాడు. కానీ రాజమౌళిపై నాకు అపారమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే సినిమా చూశా. ప్రతి సన్నివేశం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి సినిమాల్ని హాలీవుడ్లో మాత్రమే చూసిన నాకు ఇది ఒక దృశ్యకావ్యంలా అనిపించింది’’ అని లింగుస్వామి చెప్పాడు.