Begin typing your search above and press return to search.
'అమ్మ' పై ఎన్ని బయోపిక్ లయ్యా?
By: Tupaki Desk | 24 Oct 2018 4:15 AM GMTబయోపిక్ ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ - బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో ఇదో హాట్ టాపిక్. టాలీవుడ్ లో ఎన్టీఆర్ - వైయస్సార్ - సైనా - సానియా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అటు బాలీవుడ్ లోనూ రాజకీయ నాయకులు - క్రీడాకారులు - స్పేస్ సైంటిస్టులపైనా వరుసగా బయోపిక్ లు తీస్తున్నారు. ఆ క్రమంలోనే కోలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ జోరందుకుంది. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి - దివంగత నాయకురాలు జయలలితపై బయోపిక్ లు తెరకెక్కించేందుకు పలువురు ఆసక్తి కనబరచడం వాడి వేడిగా చర్చకు తావిచ్చింది.
ఇదివరకూ తమిళ స్టార్ డైరెక్టర్ - జాతీయ అవార్డు గ్రహీత మిస్కిన్ శిష్యురాలు ప్రియదర్శిని `అమ్మ`పై ఓ బయోపిక్ తీస్తున్నారని ప్రచారమైంది. చెన్నయ్ కి చెందిన పేపర్ టేల్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అలానే హైదరాబాద్ కు చెందిన విబ్రి మీడియా- బృందా ప్రసాద్ ఓ బయోపిక్ తీస్తున్నామని ప్రకటించారు. `మదరాసి పట్టణం` ఫేం ఏ.ఎల్.విజయ్ ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తారని - స్క్రిప్టు రెడీ అవుతోందని బృంద అప్పట్లోనే మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 24న జయలలిత జయంతి రోజున ఈ రెండు బయోపిక్ లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే జయలలిత బయోపిక్ స్క్రిప్టులు రెడీ అవుతున్నాయి.
తాజాగా ఈ బయోపిక్ రేస్ లోకి తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి వచ్చారు. `పందెంకోడి` ఫ్రాంఛైజీ డైరెక్టర్ గా లింగుస్వామికి ఉన్న క్రేజు తెలిసిందే. ఇటీవలే `పందెంకోడి 2` (సందెకోజి 2) చిత్రంతో కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన అమ్మ బయోపిక్ పై దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ మీడియాలో దీనిపై వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇదంతా సరే.. ఒకవేళ జయలలిత బయోపిక్ లు తీస్తే ఏ కథానాయిక సూటబుల్? అంటూ ఆన్ లైన్ లో పలు సర్వేలు సాగుతున్నాయి. అందులో ప్రఖ్యాత తమిళ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన రిపోర్ట్ అందింది. మెజారిటీ పార్ట్ తమిళ జనం జయలలిత పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటిస్తే బావుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రమ్యకృష్ణకు 33శాతం ఓటింగ్ - నయనతారకు 27శాతం ఓటింగ్ - విద్యాబాలన్ కు 21 శాతం - అనుష్క శెట్టికి 19 శాతం ఓటింగ్ దక్కింది. ఒకేసారి రెండు మూడు బయోపిక్ లు తీస్తున్నారు కాబట్టి, ఎక్కువ మంది కథానాయికల అవసరం కనిపిస్తోంది. మరి ఆ జాక్ పాట్ ఎవరెవరికి దక్కనుందో చూడాలి. ఇంతకీ లింగుస్వామి ఏ కథానాయికకు ఛాన్సిస్తారో చూడాలి.