Begin typing your search above and press return to search.

కరోనాకు నయనతార పెళ్లికి లింక్‌?

By:  Tupaki Desk   |   28 Jun 2021 4:00 PM IST
కరోనాకు నయనతార పెళ్లికి లింక్‌?
X
లేడీ సూపర్ స్టార్‌ నయనతార సినిమాలతో ఎంతగా ఫేమస్ అయ్యిందో అంతకు మించి వివాదాలతో వార్తల్లో నిలిచింది. నయనతార హీరోయిన్‌ గా కెరీర్‌ ఆరంభించినప్పటి నుండి ఆమె ప్రేమ పెళ్లి గురించిన వార్తలు వస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఆ వార్తలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నయనతార యువ దర్శకుడు విఘ్నేష్‌ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం అందరికి తెల్సిందే. వీరి రహస్య ప్రేమ బహిరంగం అయ్యి చాలా కాలం అయ్యింది. ప్రేమ విషయం బయటకు వచ్చినప్పటి నుండి పెళ్లి గురించిన వార్తలు వస్తున్నాయి. అదుగో ఇదుగో అంటూ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి.

ఇద్దరు ప్రస్తుతం చెన్నైలో సహజీవనం సాగిస్తున్నారు. కొందరు ఇద్దరికి పెళ్లి అయ్యిందనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఆమద్య తిరుపతిలో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. కాదు తమిళనాడులోని ఒక చిన్న దేవాలయంలో వీరి పెళ్లి అంటూ కథనాలు తమిళ మీడియాలో వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార విఘ్నేష్‌ శివన్ ల వివాహం అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో జరుగబోతుందట.

ప్రస్తుతం కరోనా కారణంగా పెళ్లిలు ఇతర కార్యక్రమాలు వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం జరిగితే అది సింపుల్‌ గా జరుగుతుంది. పెద్ద ఎత్తున సెలబ్రెటీలు స్టార్స్ రావాలంటే మాత్రం కరోనా పూర్తిగా తగ్గిన తర్వాతే జరుగుతుంది. కనుక కరోనా పూర్తిగా తగ్గి పరిస్థితులు సాదారణ స్థితికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆ కపుల్‌ భావిస్తున్నారట. ఈ గ్యాప్ లో సాధ్యం అయినన్ని సినిమాలను ఆమె చేసేయాలని భావిస్తుంది. ఇటీవలే నయన్ కు బాలీవుడ్ నుండి ఆఫర్‌ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.