Begin typing your search above and press return to search.
పుష్ప తో రవితేజ68 కు లింక్ !
By: Tupaki Desk | 1 July 2021 5:30 AM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా కు ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందనే విషయం తెల్సిందే. బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తుంది. పుష్ప సినిమా పూర్తిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే కొనసాగుతుంది అనేది టాక్. పుష్ప సినిమా తరహాలోనే రవితేజ నటించబోతున్న 68 వ సినిమా కూడా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం అందుతోంది.
రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వం లో ఖిలాడీ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. వెంటనే కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా కు 'ఎమ్మార్వో' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించే ఎమ్మార్వో పాత్రలో రవితేజ కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎమ్మార్వోగా రవితేజ లుక్ మరియు ఆయన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
రవితేజకు శరత్ చెప్పిన కథ నచ్చడం వల్ల అంతకు ముందు కమిట్ అయిన సినిమా లను కూడా పక్కకు పెట్టి ఎమ్మార్వోగా కనిపించేందుకు సిద్దం అయ్యాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే సినిమాను ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. రచయితగా మంచి గుర్తింపు దక్కించుకున్న శరత్ మండవ దర్శకుడిగా మొదటి సినిమాతో సక్సెస్ అవుతాడనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు. పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సమయంలో మళ్లీ అదే జోనర్ లో రవితేజ సినిమా ఉండబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బజ్ భారీగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.