Begin typing your search above and press return to search.

ఒక్క‌టైనా లిప్ లాక్ లేక‌పోతే కష్ట‌మ‌ని..!

By:  Tupaki Desk   |   12 May 2022 4:59 AM GMT
ఒక్క‌టైనా లిప్ లాక్ లేక‌పోతే కష్ట‌మ‌ని..!
X
ఇటీవ‌లి కాలంలో లిప్ లాక్ లేనిదే సినిమా లేదు. యూత్ ఫుల్ ల‌వ్ స్టోరీల్లో ఇది కామ‌న్ గా మారింది. యువ‌న‌టీన‌టులు బిడియ‌ప‌డ‌క అభ్యంత‌రం చెప్ప‌క లిప్ లాక్ లు య‌థేచ్ఛ‌గా లాగించేస్తుంటే వాటిని థియేట‌ర్ల‌లో ఆడియెన్ అంతే ఎంజాయ్ చేస్తున్నారు.

అదంతా స‌రే కానీ సీరియ‌స్ గా సాగే దేశ‌భ‌క్తి డ్రామాలో అంతే రొమాంటిగ్గా లిప్ లాక్ వేస్తే ఎలా ఉంటుంది? ఇదే విష‌యంపై అడివి శేష్ సోష‌ల్ మీడియాల్లో ప్ర‌శ్న‌ల్ని ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన మేజ‌ర్ ట్రైల‌ర్ లో అత‌డు స‌యీ మంజ్రేక‌ర్ లేలేత పెద‌వుల‌పై ఘాడ‌మైన చుమ్మా ఇచ్చేస్తుంటే యూత్ గుండెలు గిల‌గిల‌లాడాయి. అందుకే ఈ ప్ర‌శ్న ఎదురైంది. అయినా సీరియ‌స్ గా ఎమోష‌న‌ల్ గా సాగే మేజ‌ర్ క‌థ‌లో ఈ లిప్ లాక్ క‌థేంటి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

అయితే ఇందులో కేవ‌లం ఆర్మీ అధికారి సాహ‌సాలు త్యాగాలు బార్డర్ డ్రామానే కాదు.. అత‌డి వ్య‌క్తిగ‌త ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా చూపిస్తున్నారు. ల‌వ్ లైఫ్ రొమాన్స్ మ్యారేజ్ వ‌గైరా కూడా తెర‌పై క‌నిపిస్తాయి. అయితే ఇందులో లిప్ లాక్ ప్ర‌ధానంగా హైలైట్ కావ‌డంతో దానిపై ఆరాలు మొద‌ల‌య్యాయి. అడివి శేష్ ప్రతి సినిమాలోనూ తన హీరోయిన్లను తెరపై ముద్దుపెట్టుకోవడం కామ‌న్. తాజా చిత్రంలోనూ అదే చేసాడు.

ఇంత‌కీ మేజ‌ర్ క‌థేంటి? అంటే.. ముంబై దాడుల్లో ప్ర‌ణాలొడ్డి తీవ్ర‌వాదుల‌తో పోరాడిన రియ‌ల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఇది. ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌లో అడివి శేష్ న‌టించగా అత‌డి ల‌వ్ గా స‌యీ మంజ్రేక‌ర్ న‌టించింది. ఈ సినిమా ట్రైలర్ కు విశేష ఆదరణ లభించడంతో పాటు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ వెల్ల‌డించింది. అడివి శేష్ - సాయి మంజ్రేకర్ మధ్య హీటెక్కించే లిప్ లాక్ సన్నివేశం ఉందని చూపించారు. భార్య‌తో రొమాన్స్ కూడా ఇందులో హైలైట్ గా ఉండ‌నుంది.

మేజ‌ర్ ఫ్యామిలీని క‌లిసిన శేష్‌ 'మేజర్' పాన్ ఇండియా క‌థాంశంతో రూపొందుతోంది. శ‌శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుదల కానుంది. ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవ‌న‌ ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆవిష్క‌రిస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభ‌రితంగా తెర‌పై చూపించ‌నున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెర‌పై చూపిస్తున్నారు.

ఉన్నికృష్ణన్ - ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ ల‌తో ఇంత‌కుముందు శేష్ ముచ్చ‌ట్లాడిన ఫోటో వైర‌ల్ అయ్యింది. ప్రతి సంవత్సరం సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ప్రియమైన కొడుకు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ ని సందర్శిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సమయంలో శేష్ .. మేజర్ సందీప్ తల్లిదండ్రుల మధ్య బంధం మరింత ఘాడంగా గొప్పగా మారింది. కాబట్టి తన తోటి దేశస్థులను కాపాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసిన భారతదేశపు కుమారుడిని గుర్తుచేసుకోవడానికి సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను శేష్ ఒక చిన్న సమావేశానికి ఆహ్వానించగా అత‌డు వారిని క‌లుసుకున్నాడు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఎవ‌రికీ తెలియ‌ని కథను తెరపైకి తెస్తూ బహుభాషా చిత్రం 'మేజర్'ని తెర‌కెక్కిస్తున్నామ‌ని శేష్ ఇప్ప‌టికే తెలిపారు. యుక్తవయస్సులోనే సైన్యంలో చేరి సంవత్స‌రాలు ప‌ని చేసిన‌ అతను వీరమరణం పొందిన ముంబై దాడి విషాద సంఘటనల వరకు ధైర్యవంతుడి ప్రయాణాన్ని తెర‌పైకి తెస్తున్నామ‌న్నారు. ట్రైల‌ర్ చూశాక‌ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

స‌‌యీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ‌- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్ర‌ధాన తారాగ‌ణం. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A+S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది. శేష్ ఈ చిత్రానికి క‌థ‌-క‌థ‌నం అందించారు. జూన్ 3న మేజ‌ర్ విడుద‌ల కానుంది.