Begin typing your search above and press return to search.
ఒకే మూవీలో ఆరుగురు హీరోయిన్స్ తో లిప్ లాక్
By: Tupaki Desk | 4 Jun 2019 1:30 AM GMTసినిమాటోగ్రాఫర్ గా భలే భలే మగాడివోయ్.. నేను లోకల్.. మహానుభావుడు.. శైలజ రెడ్డి అల్లుడు చిత్రాలకు పని చేసిన నిజార్ షఫీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటి వరకు ఎంతో మంది సినిమాటోగ్రాఫర్స్ దర్శకులుగా తమ అదృష్టంను పరీక్షించుకున్నారు. అయితే ఎక్కువ శాతం మంది దర్శకులు అంతగా ఆకట్టుకోలేక పోయారు. ఇప్పుడు నిజార్ షఫీ దర్శకుడిగా విభిన్నమైన నేపథ్యంతో '7' అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఆరుగురు హీరోయిన్స్ నటించిన ఈ చిత్రంలో హవీష్ హీరోగా నటించాడు. ఈ వారంలో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు నిజార్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
ఈ సందర్బంగా నిజార్ మాట్లాడుతూ.. హీరో హవీష్ ఒకానొక సమయంలో నాకు ఫోన్ చేసి మంచి స్టోరీ ఉంది దర్శకత్వం చేసే ఆలోచన ఉందా అంటూ ప్రశ్నించాడు. అందుకు వెంటనే ఆలోచించుకుని చేస్తానంటూ చెప్పాను. దర్శకత్వం చేయాలనే కోరిక చాలా కాలం నుండే ఉందిని అయితే ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. ఒక మంచి స్పై థ్రిల్లర్ కథాంశం అవ్వడంతో మరింత ఛాలెంజింగ్ తీసుకుని సినిమా చేద్దామనుకున్నాను. దర్శకుడు రమేష్ వర్మ అండ్ టీంతో కలిసి కథను డెవలప్ చేశాము. స్క్రిప్ట్ వర్క్ తర్వాత డైరెక్షన్ లో రమేష్ వర్మ గారు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ చిత్రం ఒక కేసు చుట్టు తిరుగుతుంది. ఆ కేసులో భాగంగా ఆరుగురు అమ్మాయిలు మరియు హవీష్‌ను పోలీసులు అనుమానించి ఎంక్వౌరీకి పిలుస్తారు. సినిమాలో ఆరుగురు హీరోయిన్స్ తో ఆరు లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ఈ లిప్ లాక్ సీన్స్ ఐడియా నాదే. విభిన్నంగా ఆరుగురు ముద్దుగుమ్మలు కూడా ముద్దు పెట్టడం వల్ల సినిమా స్థాయి ఎక్కడికో వెళ్తుందని యూనిట్ సభ్యులు నమ్మారు. అందుకే దర్శకుడు చెప్పిన నిర్ణయానికి ఓకే చెప్పారట. హాట్ హీరోయిన్స్ ఉండటంతో ఈ చిత్రంపై మాస్ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరిని ఈ చిత్రం మెప్పించే విధంగా ఉంటుందని దర్శకుడు అంటున్నాడు. నిజార్ చేసిన మొదటి ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి.