Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకుంది.. దుమారం రేగింది
By: Tupaki Desk | 3 Nov 2016 9:16 AM GMTకోరుకున్న వాడిని పెళ్లి చేసుకుని ఆనందంగా హనీమూన్ చేసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్ లిసా హేడెన్ కు లేని పోని తలనొప్పులు ఎదురయ్యాయి. హనీమూన్ ఎంజాయ్ చేయడం మాని.. సోషల్ మీడియాలోకి వచ్చి అందరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తెలుగులో ‘రచ్చ’ సినిమాలో ఓ పాటలో తళుక్కుమన్న లిసా.. బాలీవుడ్లో హౌస్ఫుల్-2 - 'క్వీన్' లాంటి సినిమాలో ఆకట్టుకుంది. ఈ మధ్యే ఆమె హఠాత్తుగా తన ప్రియుడు డినో లల్వానీని పెళ్లి చేసుకుంది. అంత వరకు బాగానే ఉంది కానీ.. ఆమె పెళ్లి చేసుకున్న వాడు పాకిస్థానీ అంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది.
లిసా భర్త డినో లల్వానీ తండ్రి గులు లాల్వానీ పాకిస్థాన్ లో జన్మించాడు. బ్రిటన్ లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. ఐతే సోషల్ మీడియాలో లిసా పెళ్లి ఫొటోలు చూసిన వాళ్లలో ఎవరో డినో తండ్రి పాకిస్థానీ కాబట్టి.. డినో కూడా పాక్ మూలాలున్న వాడే అన్న వాదన తెచ్చారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో లిసా.. ఒక పాకిస్థానీని పెళ్లాడిందంటూ వివాదం రాజేశారు. దీంతో లిసాకు లేనిపోని తలనొప్పి మొదలైంది. నా భర్త పాకిస్థానీ కాదు.. అతనెప్పుడూ ఆ దేశంలో లేడని.. నా పెళ్లిని వివాదం చేయొద్దని ఆమె ట్విట్టర్లో మొత్తుకోవడం మొదలుపెట్టింది. తన మామ భారత్.. పాకిస్థాన్ విడిపోని సమయంలో కరాచిలో పుట్టారని.. ఆయన పాకిస్థానీ కాదని ఆమె వివరణ ఇచ్చుకుంది. ప్రపంచం ఎప్పుడూ ప్రేమను.. ప్రేమికులను కోరుకుంటుంది తప్ప ద్వేషాన్ని కాదని.. ప్రతి విషయాన్నీ వివాదం చేయడం మానుకోవాలని.. తమనకు ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆమె వేడుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/