Begin typing your search above and press return to search.

'రచ్చ' బ్యూటి పెళ్ళి హోగయా!!

By:  Tupaki Desk   |   30 Oct 2016 11:30 AM GMT
రచ్చ బ్యూటి పెళ్ళి హోగయా!!
X
పాకిస్తాన్ లో పుట్టిన బ్రిటన్ వ్యాపారవత్త డినో లల్వానితో చాలాకాలం నుండి ప్రేమాయణం సాగిస్తోంది హాట్ బ్యూటి లిసా హేడన్. చెన్నయ్ లో పుట్టి ఫారిన్ లో పెరిగిన లిసా.. ఇప్పటికే రామ్ చరణ్‌ 'రచ్చ' సినిమా టైటిల్ సాంగులో ఇచ్చిన స్పెషల్ ఎప్పీయిరెన్సుతో సుపరిచితం. ఈ భామ ఒక నెల క్రిందట త్వరలోనే డినోను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇకపోతే నిన్న సాయంత్రం ఒక బీచ్ సాక్షిగా క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకుంది లీసా. తన స్నేహితురాళ్లు ఆమెకు బ్రయిడ్ మెయిడ్స్ కాగా.. దగ్గర బంధువులు అందరూ అటెండ్ అయ్యారు. తన మ్యారేజ్ ఫోటోలన్నీ స్వయంగా తనే షేర్ చేసింది ఈ 30 ఏళ్ళ సుందరి. ఇకపోతే మొన్న రిలీజైన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో లీసా రణబీర్ కపూర్ గాళ్‌ ఫ్రెండ్ గా ఒక రోల్ చేసింది. కామెడీ టైమింగ్ అండ్ పంచ్ తో అమ్మడు అదరగొట్టేసింది. అందరూ ఆ యాక్ట్ ను ఎంజాయ్ చేస్తున్న వేళ సడన్ గా తనకు పెళ్ళి హోగయా అని చెప్పడం కాస్త షాకింగే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/