Begin typing your search above and press return to search.
హలో.. అప్పుడు నాన్న.. ఇప్పుడు అమ్మ
By: Tupaki Desk | 21 Dec 2017 4:41 AM GMTఅక్కినేని అఖిల్ రెండో సినిమా ‘హలో’లో కథానాయికగా నటించిన క్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆమె మలయాళ లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్.. 80ల్లో తెలుగులో కొన్ని మంచి సినిమాలు చేసిన అందాల తార లిజిల తనయురాలు. ఈ అమ్మాయికి ఇదే తొలి సినిమా. మలయాళంలో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా తెలుగులోనే ఆమెను కథానాయికగా పరిచయం చేస్తున్నారు.
ఐతే ప్రియదర్శన్.. లిజి కలిసి కాకుండా విడివిడిగా కూతురి కోసం ఇక్కడికి రావడం విశేషం. ఇందుక్కారణం వాళ్లిద్దరూ కొన్నేళ్ల కిందటే విడాకులు తీసుకోవడమే. కళ్యాణి తల్లి దగ్గరే పెరిగినప్పటికీ.. అప్పుడప్పుడూ తండ్రి ఇంట్లోనూ ఉంటుంది. ఆమె కెరీర్ విషయంలో ఇద్దరూ కలిసే నిర్ణయం తీసుకున్నారు. ఐతే నాగార్జునతో ప్రియదర్శన్ కు ఉన్న పరిచయం వల్ల ఆయన వల్లే కళ్యాణికి కథానాయికగా తొలి అవకాశం వచ్చింది.
ముందుగా ప్రియదర్శనే కూతురితో కలిసి ‘హలో’ ఆడియో వేడుకకు వచ్చాడు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. ఆ సందర్భంగా కళ్యాణి ప్రసంగించినపుడు ఆయన ఉద్వేగంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ కు లిజి హాజరైంది. ఆమె ఈ వేడుకలో చాలా ఉల్లాసంగా నవ్వుతూ కనిపించింది. మొత్తానికి కూతురు నటించిన తొలి సినిమా కోసం తల్లిదండ్రులు ఇలా వేర్వేరుగా రావడం చర్చనీయాంశంగా మారింది.