Begin typing your search above and press return to search.
రివైండ్ 2019: టాలీవుడ్ శృంగార కేళి
By: Tupaki Desk | 2 Jan 2020 3:55 AM GMTమితిమీరిన హింస.. హద్దులు దాటిన శృంగారం.. అడల్ట్ కామెడీ చిత్రాలకు సెన్సార్ కత్తెర గుదిబండగా మారేది. అయితే ఆ హద్దులు కొంత మేరకు తొలగిపోవడంతో 2019లో అడల్ట్ సినిమాల ప్రవాహం మొదలైంది. స్ట్రెయిట్ కమర్షియల్ చిత్రాలు 180కి మించి విడుదలైతే అడల్ట్ సినిమాలు 20 నుంచి 25 వరకు విడుదలయ్యాయంటే మన వాళ్లు కూడా బాలీవుడ్ తరహా అడల్ట్ కామెడీ చిత్రాలు నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నారన్నమాట.
ఈ ఏడాది ఎడా పెడా హద్దులు దాటిన శృంగార సన్నివేశాలతో యూత్ ని టార్గెట్ చేస్తూ చాలా సినిమాలొచ్చాయి. అందులో కొన్ని మాత్రమే ఆకట్టుకుని లాభాలు తెచ్చిపెట్టాయి. అలా నిలిచిన టాప్ లెన్ చిత్రాలు `ఏడు చేపల కథ- చీకటి గదిలో చితక్కొట్టుడు- ఆర్డీఎక్స్ లవ్- రాయలసీమ లవ్ స్టోరీ- అగ్లీ- రొమాంటిక్ క్రిమినల్స్- నేను లేను- 4 లెటర్స్- కొత్తగా మా ప్రయాణం- మాగ్నెట్.. ఈ టాప్ 10లో వాసూళ్లని రాబట్టినవి మూడు చిత్రాలు మాత్రమే. ట్రైలర్ తోనే గిలిగింతలు పెట్టిన సినిమా `ఏడు చేపల కథ`. ఇలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తానే అనేంతగా అభిషేక్ రెడ్డి ఈ చిత్రంలో నటించాడు.
సినిమాలో అత్యధికంగా అడల్ట్ కంటెంట్ వుండటం తో సెన్సార్ ఇబ్బందులు తలెత్తాయి. అయినా ఫైట్ చేసి చివరికి కొన్ని కట్స్‌తో సెన్సార్ ని సాధించి రిలీజ్ చేశారు. ఆ తరువాత స్థానంలో నిలిచిన సినిమా `చీకటి గదిలో చితక్కొట్టుడు`. ఘోస్ట్ కామెడీ నేపథ్యంలో పక్కా అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా కూడా ముందు ట్రైలర్ తోనే పిచ్చెక్కించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మేకర్స్‌కి లాభాల పంట పండించింది. ఇక మూడవ స్థానం లో పాయల్ రాజ్‌పుత్ నటించిన `ఆర్డీఎక్స్ లవ్` నిలిచింది. `ఆర్ ఎక్స్ 100`లో తనదైన స్టైల్లో రెచ్చి పోయిన నటించిన పాయల్ ఈ చిత్రంలోనూ లిప్ లాక్‌లతో అదరగొట్టేయడం తో భారీ గా ఓపెనింగ్స్ వచ్చాయి.