Begin typing your search above and press return to search.

బాహుబలి పుణ్యమా అని..

By:  Tupaki Desk   |   16 July 2016 9:16 AM GMT
బాహుబలి పుణ్యమా అని..
X
సినిమాలకు సంబంధించి నేషనల్ లెవెల్లో ఏ చర్చ జరిగినా.. పోల్ పెట్టినా.. సర్వేలేవైనా చేసినా.. తెలుగు సినిమాకు చోటు దక్కడం అరుదు. అప్పుడప్పుడూ రిలీజ్ చేసే గూగుల్ సెర్చ్ టాప్ లిస్టుల్లో కూడా తెలుగు సినిమాకు కానీ.. తెలుగు నటీనటులకు కూడా చోటు దక్కదు. బాలీవుడ్ సినిమాలు.. నటీనటుల తర్వాత ఈ జాబితాల్లో చోటు దక్కించుకునేది తమిళ సినిమాలు.. తమిళ స్టార్లు మాత్రమే. ఐతే ‘బాహుబలి’ పుణ్యమా అని ఈ మధ్య తెలుగు సినిమా పేరు జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. మన సినిమాకు గూగుల్ సెర్చ్ లిస్టులో సైతం చోటు దక్కింది. గత దశాబ్ద కాలంలో గూగుల్లో అత్యధికమంది వెతికిన ఇండియన్ సినిమాల జాబితాలో ‘బాహుబలి’కి చోటు దక్కడం విశేషం.

ఈ జాబితాలో అమీర్ ఖాన్ సినిమా ‘పీకే’ నెంబర్ వన్ ప్లేస్ లో నిలవగా.. విద్యాబాలన్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘కహానీ’కి రెండో స్థానం దక్కడం విశేషం. ‘బాహుబలి’ మూడో స్థానంలో నిలిచింది. ఆషికి-2.. ధూమ్-3 తర్వాతి స్థానాలు సాధించాయి. ఇక గూగుల్లో అత్యధికమంది వెతికిన హీరోల జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిస్తే.. సన్నీ లియోన్ హీరోయిన్ల జాబితాలో నెంబర్ వన్ గా నిలవడం విశేషం. హీరోల్లో షారుఖ్ ఖాన్.. అక్షయ్ కుమార్.. అమితాబ్ బచ్చన్.. రజినీకాంత్ తర్వాతి స్థానాలు సాధించారు. హీరోయిన్లలో కత్రినా కైఫ్.. కరీనా కపూర్ 2-3 స్థానాల్లో నిలిస్తే సౌత్ సినిమాల స్టార్ కాజల్ అగర్వాల్ కు నాలుగో స్థానం దక్కింది. దీపికా పదుకొనే ఆమె కంటే వెనక ఐదో స్థానంలో నిలవడం విశేషం. క్లాసిక్ హీరోల జాబితాలో అమితాబ్ బచ్చన్-కమల్ హాసన్-రాజేష్ ఖన్నా-రాజ్ కుమార్-మిథున్ చక్రవర్తి వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. క్లాసిక్ హీరోయిన్లలో రేఖ-శ్రీదేవి-మధుబాల-హేమమాలిని-జీనత్ అమన్ తొలి ఐదు స్థానాలు సాధించారు.