Begin typing your search above and press return to search.
'శ్యామ్ సింగ రాయ్' నుంచి గూస్ బమ్స్ తెప్పించే లిటిల్ సర్ప్రైజ్..!
By: Tupaki Desk | 5 Nov 2021 1:41 PM GMT'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. 1970స్ కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్.. దీపావళి కానుకగా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన 'రైజ్ ఆఫ్ శ్యామ్' సాంగ్ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫుల్ లిరికల్ సాంగ్ వీడియోని రేపు (అక్టోబర్ 6) శనివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గూస్ బమ్స్ అలర్ట్ అంటూ ఓ లిటిల్ సర్ప్రైజ్ వీడియోని వదిలారు. బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ ఈ పాటను ఉర్రూతలుగించేలా పాడిన విధానాన్ని ఇందులో చూడొచ్చు. ఇక నాని మీసం తిప్పుతూ ఎవరికో వార్నింగ్ ఇస్తుండటం.. కాలు మీద కాలేసుకుని సిగరెట్ తాగడం వంటివి మానిటర్ లో కనిపిస్తున్నాయి.
'శ్యామ్ సింగ రాయ్.. అరే ఎగసెగిసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే..' అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్యామ్ సింగ రాయ్ ఒక లెజెండ్ గా ఎలా మారాడో ఈ పాట వివరిస్తుంది. నాలుగు దక్షిణాది భాషల్లోనూ విశాలే ఈ పాట పాడటం విశేషం. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి కూడా దీనికి గొంతు కలిపారు. మెలోడీ సాంగ్స్ స్పెసిలిస్ట్ గా పిలబడే మిక్కీ జె మేయర్ ఈ పాటకు తన స్టైల్ కు భిన్నమైన ట్యూన్ కంపోజ్ చేశారు. తెలుగు వెర్సన్ కు కృష్ణ కాంత్(కె.కె) సాహిత్యం అందించారు.
కాగా, ''శ్యామ్ సింగరాయ్'' చిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు - మోషన్ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రేపు రాబోయే ఫస్ట్ సింగిల్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
ఇది నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ జంగా దీనికి కథ సమకూర్చారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.