Begin typing your search above and press return to search.
నటిగా నన్ను సవాల్ చేసింది లైవ్ టెలికాస్ట్: కాజల్ అగర్వాల్
By: Tupaki Desk | 29 Jan 2021 3:45 PM GMTస్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. త్వరలో ఓ వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టబోతుంది. ఇంతకాలం సినిమాలలో అలరించిన కాజల్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటిటిలలో కనిపించలేదు. ఫిబ్రవరిలో ఆ పని కూడా పూర్తిచేస్తోంది. కాజల్ నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ 'లైవ్ టెలికాస్ట్'. ఫిబ్రవరి 12న ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
ఈ మేరకు ఆఫీసియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసారు దర్శకనిర్మాతలు. ఇప్పటి వరకు అన్ని జానర్స్ ట్రై చేసిన కాజల్ ఇప్పుడు తనలోని భయం కూడా చూపించబోతుంది. ఇదివరకే శృతిహాసన్, సమంత, తమన్నా, ఈషా రెబ్బా, నిత్యామీనన్ లాంటి స్టార్ హీరోయిన్స్ డిజిటల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చేసారు. కాజల్ తో పాటు సమంత నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్2' కూడా ఫిబ్రవరి 12న స్ట్రీమ్ కానుంది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. హారర్ థ్రిల్లర్ కావడంతో లైవ్ టెలికాస్ట్ కోసం అభిమానులు ఆసక్తిగానే ఉన్నారు.
'ఒక నటిగా నన్ను నిరంతరం సవాలు చేసే పాత్రలకోసం వెతుకుతున్నాను. ఈ లైవ్ టెలికాస్ట్ ఇంతకాలం ఉన్న నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకొచ్చింది. ఇందులో నా పాత్ర పేరు జెన్నీ. వృత్తిరీత్యా డైరెక్టర్. ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ గా ఓ టీవీ షో చేయడమే క్యారెక్టర్ లక్ష్యం. ఆ అన్వేషణలో భాగంగా ఓ పెద్ద ఇంట్లో ఇరుక్కుపోయినట్లు గుర్తిస్తుంది.
హారర్ స్టోరీస్ ఇష్టపడేవారికి ఈ వెబ్ సిరీస్ బాగా నచ్చుతుంది' అంటూ వెబ్ సిరీస్ గురించి పలు విషయాలు బయటపెట్టింది చందమామ. అతీంద్రియ శక్తులచే నియంత్రించబడే ఇంట్లో వారు చిక్కుకున్నారని గ్రహించిన సూపర్ హిట్ షోను రూపొందించడంలో ఓ టీవీ సిబ్బంది ఎలా నెట్టుకొచ్చింది అనే కథను ఈ సిరీస్ వివరిస్తుందట. ఇక ఈ సిరీస్‌లో వైభవ్, ఆనంది కీలక పాత్రల్లో నటించారు. ఈ లైవ్ టెలికాస్ట్ 10 ఎపిసోడ్లుగా రాబోతుంది. పారానార్మల్ యాక్టివిటీస్ తరహాలో ఈ సిరీస్ ట్రై చేసాడట డైరెక్టర్ వెంకట్ ప్రభు. ప్రస్తుతం కాజల్.. ఆచార్య, మోసగాళ్లు, భారతీయుడు 2, ముంబై సాగా సినిమాలలో నటిస్తోంది.